చంద్రబింబం వంటి కనకం లాంటి ముఖం
చెదరని ప్రేమను గుండెల్లో నింపుకొని
తాను ప్రేమించే వారి కోసం వారి పరిరక్షణ కోసం
తన విలువైన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా
సముద్రం లాంటి సమాజం లో ఒక నావికురాలిగా ప్రయాణిస్తున్న అంగన
ఉవ్వెత్తున ఉప్పొంగే అలల మధ్య తెరల ప్రయాణం
అందరి జీవితాలలో ఉజ్వలమైన కాంతిని
తీసుకురావాలని తన నిరీక్ష తపన
రణ గోల ధ్వనుల లాంటి మాటల మధ్య
ఉధృతమైన వేగంతో దూకే ఎన్నో ఆందోళనలో
కడగండ్లలో జీవనం తన ప్రేమ నదిప్రేయసిలాగా ప్రవహిస్తోంది
ధర్మపత్నిలా ప్రతి రుతువు ,
ప్రతి కృతువు శతతము సేవలు చేస్తుంది
తన మది ఒక కోవెల ప్రతి ఒక్కరి జీవితానికి
సువర్ణాభరణమై రంగులద్దుతుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి