చెరపకురా చెడేవు.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .9884429899.
 అమరావతి నగరంలోని విశ్రాంత ఆటవి శాఖాధికారి రాఘవయ్యగారి ఇంటి అరుగుపై ఆవాడకట్టులోని పిల్లలు అందరుచేరారు.పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన రాఘవయ్యగారు"బాలలు మీఅందరికి ఈరోజు ఒక కథ చెపుతాను"పూర్వం శివయ్య అనే అమాయకుడు ఉండేవాడు.ఒకరోజు తన తమ్ముడి చూడటానికి పొరుగుఊరు నడకమార్గన వెళ్లసాగాడు. అలావెళుతూ చాలా దూరం ప్రయాణంచి, చేరవలసినఊరు చేరి ఓక చెట్టుకొమ్మనీడన తలపాగా పరుచుకుని తనవెంటతెచ్చుకున్నఆహారం తిని నీళ్ళుతాగి అక్కడే నిద్రపోయాడు.కొంతసేపటికి ఒకవ్యక్తి వచ్చి తట్టినిద్రలేపి"ఏమయ్యబాటసారి డబ్బుచెల్లించకుండా మాయింటి చెట్టునీడ ఎలావాడుకుంటున్నావు.అయిదు రూపాయలు చెల్లించు"అన్నాడు ఆవ్యక్తి."ఏమిటి రోడ్డు పైకి వచ్చిన మీయింటి చెట్టుకొమ్మనీడకు డబ్బులుచెల్లించాలా" అన్నాడు శివయ్య."అవును"అన్నాడు ఆవ్యక్తి."సరే నా దగ్గర డబ్బులేదు,ఇక్కడకు దగ్గరలో మాతమ్ముడు పూల అంగడి నడుపుతున్నాడు నాతోరండి వాడిదగ్గరతీసుకు ఇస్తాను"అన్నాడు శివయ్య.అతనివెంట వచ్చినవ్యక్తి శివయ్య తమ్ముడి అంగడిచేరిన వెంటనే అక్కడి కూజాలోనినీళ్లు ఒకగ్లాసు లోనికి వంపుకుని తాగాడు ఆవ్యక్తి.విషయంఅంతావిన్న శివయ్యతమ్ముడు "అయ్య రోడ్డుపైకి వచ్చిన మీయింటి చెట్టుకొమ్మన మాఅన్నగారు నిద్రించినందుకు డబ్బులు అడగటంన్యాయమే,అలాగే ఇస్తాను, నాఅంగడి లోని పూవ్వుల పరిమళం మీరు పీల్చుకున్నందు కుపదిరూపాయలు నానీళ్లుతాగినందుకు పదిరూపాయాలు మెత్తం ఇరవైరూపాయలు మర్యాదగా ఇవ్వండి" అన్నాడు."ఏమిటి ఉచితంగాలభించే నీటికి,పూలపైనుండివచ్చేవాసనకి డబ్బు చెల్లించాలా"అన్నాడు ఆవ్యక్తి."అయ్య మీఇంట ఉచితంగా మొలచి రోడ్డుపైకివచ్చిన చెట్టుకొమ్మ నీడకే అయిదు రూపాయలు మీరు తీసుకోగా, పదివేలరూపాయలపూవ్వులుకొని,వందరూపాయలకూజా కొని,ఇరవైరూపాయల లోటా కొని,రోజుమంచి నీళ్లుతెచ్చిపోసేవారికి నెలకు వందరూపాయలు చెల్లించేనేను వాటికి డబ్బు అడగటం అన్యాయంఎలా అవుతుంది,పదండి న్యాయాధికారిగారివద్దకు వెళదాం"అన్నాడు. అమాయకుడిని మోసగించబోయి తానే మోసపోయిన ఆవ్యక్తి శివయ్యతమ్ముడికి అడిగినంత డబ్బులు చెల్లించి ఇంటిదారిపట్టాడు.
"బాలలు కథవిన్నారుగా ఒకరిని మోసగించాలని ప్రయత్నిస్తే,మనమే మోసపోతాము అనితెలుసుకున్నారుకదా,ఎన్నడు ఎవరిని మోసగించే ప్రయత్నంచేయకండి"అన్నాడు రాఘవయ్యతాత.

కామెంట్‌లు