అవంతి నగర పొలిమేరలలో సదానందుడు ఆశ్రమం నిర్మించుకుని విద్యాదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పాఠం చెపుతూ.....పూజలలో రెండు రకాలు పెద్దలు చెప్పారు.మానసికపూజ,బాహ్యపూజగా విభజించ బడింది.బాహ్యపూజను'బహిర్యాగం'అని మానసిక పూజను'అంతర్యాగం' అంటారు.పతాంజలి యోగశాస్త్రంలో దేవుని పూజించాలి అనుకునే భక్తుడు యమనియమాలు పాటించాలని,అవిమనో మాలిన్యాలను తొలిగిస్తాయి అని చెప్పబడింది. అహింస,సత్యం,అస్తేయం,బ్రహ్మచర్యం,అపరిగ్రహం,యమాలుగా చెప్పబడితే,శౌచం,సంతొషం,తపస్సు,స్వాధ్యాయం,ఈశ్వరఫణిదానం అనేలక్షణాలు నియమాలని చెప్పారు.ఆస్తీయం అంటే దొంగతనం చేయకపోవడం,అపరిగ్రహం అంటే సంపదను అధికంగా కూడబెట్టకపోవడం, స్వాధ్యాయంఅంటే పవిత్రగ్రంధాలను చదవడం, ఈస్వరఫణిదానం అంటే సత్ఖర్మలనుచేసి ఆఫలాన్ని పరమేశ్వరునికి అంకితమీయడం,యివన్ని పాటించినవారే పూజకు అర్హులు.భగవంతుడి శబ్దమందలి'భగ'శబ్దమునకు...ఐశ్వర్యము,యశము,శ్రీ,వాక్కు,జ్ఞానము,వైరాగ్యము అని ఆరు అర్థలు ఉన్నాయి.భగవంతుని నవమార్గాలలో పూజించవచ్చునని మనపూర్వీకులు తెలియజేసారు.అవి, శ్రవణభక్తి,కీర్తనం,స్మరణం,పాదసేవనం,అర్చనాభక్తి,వందనాభక్తి,దాస్యభక్తి,ఆత్మనివేదనం,మధురభక్తి,అనిచెపుతారు.భగవంతునికి మనం సమర్పించే పుష్పాలు కొంతసమయం తరువాత వాతవాడి పోతాయి.కాని ఎన్నటికివాడని నిత్యతేజోవంతము పరిమళభరితమైన కొన్ని పుష్పాలు ఉన్నాయి.అవి మానసిక పుష్పాలు అహింస,ఇంద్రియనిగ్రహం, సర్వభూ తదయ,క్షమ,జ్ఞానం,ధ్యానం,తపస్సు,సత్యవ్రతం,అనేపుష్పాలతో భగవంతుని భక్తిశ్రధ్ధలతో పూజించాలి.
అలాగే వానప్రస్త,సన్యాస,న్యాయవిలువలు...
మానవజీవితాన్ని ప్రభావితం చేసే నాలుగు దశలే నాలుగు ఆశ్రమాలు.బ్రహ్మచర్యం,గృహస్ధం,వానప్రస్ధం,సన్యాసం అనే ఈనాలుగు ఆశ్రమాలు భారతీయ జీవితాలకు ఆశ్రమభావన చేయగలిగాయి.నియమ నిభంధనలకు లోబడి భావిజీవితాన్ని భవ్యంగా రూపొందించుకోవడానికి కావలసిన విజ్ఞానాన్ని సంపాదించుకునే దిశగా ప్రయాణంచేయిస్తాయి. అటువంటివారు భారతీయల జీవన విధానాన్ని హుదయసౌశీల్యతను లోకానికి తెలియజేసారు.
వానప్రస్ధ జీవనాన్ని పూర్వికులు నాలుగు విధాలుగా చెప్పారు.దుంపలు తొవ్వుకుని భుజించేవారిని"వైఖానసులు"అని.కొత్తపంట చేతికి అందగా గతంలో దాచిన ధాన్యాన్ని పూర్తిగా ఇతరులకు పంచి పెట్టేవారిని "వాలఖిల్యులు"అని.ఉదయం నిద్రలేవగానే ఏదిక్కు కని పిస్తుందో ఆదిక్కుకు వెళ్లి అక్కడ ఆయాచితంగా లభించినవాటిని భుజించేవారిని "ఔదుంబరులు"అంటారు.చెట్టునుండిరాలిన ఫలాలను పత్రాలను తిని జీవించేవారిని"ఫేనపులు"అంటారు.
సన్యాసులనుకూడా నాలుగు విధాలుగా పిలువబడ్డారు.సొంతకుటీరం ఉండి చేయదగిన ఖర్మలు చేసేవాడు"కుటీచకుడు"కుటీరంలేకుండా కర్మలు అప్రధానంగా జ్ఞానియై సంచరిస్తుండేవారు "బహూదుడు" అని.కేవలంజ్ఞానాభ్యాసం మాత్రమే చేసేవాడు."హంసుడు"అని .జ్ఞానాభ్యాసం కూడా లేకుండా పరబ్రహ్మతత్వం అలవడిన వారిని "నిష్కప్రియుడు"అంటారు.
అన్వీక్షకి,త్రయీ,వార్త,దండనీతి అనేవి న్యాయవిద్యలు.అన్విక్షకి అంటే ఆత్మానాత్మ వివేకం కలిగి మోక్షాన్ని ప్రసాదించేవిద్య.త్రయీ అంటే స్వర్గాదిఫలాలను అందించే వేదకర్మానుష్ఠానం.వార్త అంటే జీవనోపాధికోసం చేసే కృషి మొదలైన విద్య.దండనీతి అంటే అర్థ సంపాదనమే ప్రయోజనంగల విద్య.ఈనాలుగు విద్యలలో అన్వేక్షకి మోక్షానికి,త్రయీ కామానికి,వార్త ధర్మానికి,దండనీతి అర్ధానికి సాధనాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి