🪷 "శివము" అనగా శుభము!
మంగళము, శోభనము!
శ్రేయస్సుకు మూలము!
శంకర ప్రియులార!
🪷"శివము" అనగ యోగము!
కల్యాణము, భద్రము!
శ్రీ కైవల్య పదము!
శంకర ప్రియులార!
( శంకర ప్రియ పదాలు., )
👌"శివము"... శ్రీ కైవల్య. పదము! ఇహలోక సౌఖ్యములకు, శ్రేయస్సులకు మూలమైనది! "శ్వశ్రేయసం.. శివం.. భద్రం.. కల్యాణం.. మoగళం.. శుభo. భావుకం.. భవికం.. భవ్యం.. కుశలం.. క్షేమo.." అనునవి, "శుభము" నకు పర్యాయ పాదములు, అని అమర కోశము వివరించు చున్నది!
👌 మంత్ర ద్రష్టలైన మన మహర్షులు, సత్.. చిత్.. ఆనంద స్వరూపమైన, సాంబశివ పరం బ్రహ్మమును దర్శించారు! వారీ విధంగా
"సముచ్చయ స్తోత్రము" నందు ప్రస్తుతిoచారు!
శివం శివకరం శాంతం
శివాత్మానం శివోత్తమమ్!
శివ మార్గ ప్రణేతారం
ప్రణతోస్మి సదాశివమ్!(1)
శాశ్వతం శోభనం శుద్ధం
శశ్వద్దోష ప్రమోచకమ్!
విశ్వం విశ్వేశ్వరం దేవం
శంకరం ప్రణమామ్యహమ్! (2)
ఈశానం వరదం దేవo
ఈశ్వరం మంత్రనాయకమ్!
ఇత్థం మాసస్తుతిం దేవి
స్తుత్వా నత్వా మహేశ్వరమ్!(3)
( అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసిన, పిమ్మట దీనిని (సముచ్చయ స్తోత్రమును) తప్ప కుండా పారాయణం చేయాలి! శివ తత్త్వమును మననము చేసుకోవాలి! శివమస్తు! శుభమస్తు!
🚩చంపక మాల
"శివమను" నామ సంస్తుతుల సేవ శుభంకరమౌ శుభోత్తమ
స్తవము శివమ్ము శాంత శుభదాయకమౌ ప్రణుతింతు నాశివున్
శివమది శోభనమ్ము శుభశీఘ్ర నిపాతక నాశనమ్ము వి
శ్వు వరదు శంకరున్ స్తుతుల శుద్ధుని నీశ్వరు సన్నుతించెదన్!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి