పిసనారి! అచ్యుతుని రాజ్యశ్రీ

 డబ్బు నీరు కరెంటు వాడకంవిషయంలో మనం చాలా పొదుపుగా ఉండాలి. ఇప్పుడు అసలే తుమ్మితే ఊడేముక్కులు ఉద్యోగాలు!ప్రభుత్వ ఉద్యోగులు ఫర్వాలేదు కానీ సాఫ్ట్వేర్లకి కూడా కష్టమే!
అలా అని తిండితినకుండా సరైన వస్త్రధారణ లేకుండా ఉన్నామో జనం తాటాకులు కడతారు. 
పిసనారి పీచయ్య కి షాపు ఉంది. ఇద్దరు పనివాళ్ళున్నారు.ఇంటిపని షాపుపని చేయిస్తూ జీతం సరిగా ఇవ్వక సతాయించేవాడు.అతనితో వాదించి పోట్లాడి లాభంలేదు అని నౌకర్లు ఇంట్లో షాపులో చేతికి అందినంత కాజేయటం మొదలు పెట్టారు. షాపు లో చిల్లర  ఇంట్లో సరుకులు మాయం అవుతున్నాయి. పీచయ్య కి ఏంచేయాలో తోచలేదు. గట్టిగా అడిగితే ఆనౌకర్లు పనిమానేస్తే అసలుకే మోసం !అందుకే కాళ్ళ బేరానికి వచ్చాడు. "అరె బాబులూ!నేనా ఒంటరిగాడిని.ఇకనుంచి నాలాభాల్లో మీకు వాటా ఇస్తా." అనటంతో "అయ్యా!మీకెంత చాకిరీ చేసినా తృప్తి లేదు. మీతర్వాత అనుభవించేవారు లేరు కదా? బడికి గుడికి వృద్ధాశ్రమం కి సాయంచేయండి.మీకు మంచి పేరు వస్తుంది. కేవలం మనం అనుభవించటంకాదు.ఇతరులకు సాయపడటంలోనే మనజన్మ సార్ధకం" అన్నారు. పీచయ్య కి  అప్పుడు జ్ఞానోదయం అయింది 🌷
కామెంట్‌లు