.. * వర్ధిల్లాలి సాహిత్యం * కోరాడ నరసింహా రావు.

 ప్రచురణ,, ప్రసార సంస్థలు !
సాహిత్య, సంస్కృతిక సంస్థలు 
రచయితలను యధాశక్తి ప్రోత్సహించబట్టే..., రచయితలు, కవులు, కళాకారులకు గుర్తింపు, గౌరవం  ప్రోత్సహించేవారున్నపుడే ప్రతిభ ద్విగుణీకృతమౌతుంది !
          ప్రచురణ, ప్రసార వ్యవస్థల మూలంగానే ప్రపంచానికి వారంతా తెలిసేది !
        ఒకప్పుడు సాహిత్య, సాంస్కృతిక సంస్థలు చాలాతక్కువే ఆయా సంస్థలతో కవులు, రచయితల పరిచయాలూ తక్కువే..., 
    స్మార్ట్ ఫోన్ లు, వాట్సాప్ గ్రూపుల ప్రవేశంతో... చక్కని అనుసందానం... సంస్థలకు వ్యక్తులకూ మధ్య ఏర్పడి... 
సంస్థలు కూడా విరివిగా పుట్టుకొచ్చాయి !ఆయాసంస్థలు వివిధ సాహిత్య పోటీలు నిర్వహించటం, బహుమతులు సన్మానాలు, సత్కారాలు ఇదంతా హర్షించదగ్గ విషయమే !
ఐతే...  వ్యక్తిగతగుర్తింపు, స్వప్రయోజనాలకోసమే కొన్ని గ్రూప్ లు పుట్టుకొచ్చి పబ్బంగడుపుకోవటము  శోచనీయం !
     ఐతే... అలాంటి గ్రూప్ లు తక్కువే !నిజాయతీగా, నిష్పక్షపాతంగా గ్రూప్ లు నడిపేవారూ ఇద్దరో, ముగ్గురో లేకపోలేదు !
       కొందరైతే... గ్రూప్ ను పెట్టే సాం ఎడ్మిన్ అయిపోయాం... నేను పలానా గ్రూప్ ఎడ్మిన్ ని 
 అని ప్రచారం చేసుకోవటం తోనే, సరి ఆగ్రూప్ ఎలా నడుస్తుందో వాళ్లకిక అనవసరం !
   ఏది ఏమైనా... వాట్సాప్ గ్రూపులు సాహిత్య సంస్థలు కలకాలం వర్ధిల్లాలి, పోటీలు నిర్వహించాలి, బహుమతులిస్తుండాలి, సన్మాన సత్కారాలు జరుపుతుండాలి !అలా అయితేనే సాహిత్యం బ్రతుకుతుంది, మరింత వికాసాన్ని పొందగలుగుతుంది 
ఈ ప్రపంచానికి సాహిత్యము సాహితీవేత్తలు తెలిసే అవకాశముంది ఆ గుర్తింపు గౌరవాలతో... మరింత సాహిత్యం పుట్టుకొచ్చే అవకాశముంటుంది !
 వర్ధిల్లాలి... సాహితీసంస్థలు 
 వర్ధిల్లాలి సాహితీవేత్తలు. 
  వర్ధిల్లాలి  సాహిత్యం 
     *******
కామెంట్‌లు