న్యాయాలు -83
తప్త భ్రాష్ట్ర తిల న్యాయము
*****
తప్త అంటే కాలిన లేదా వేడి చేయబడిన అని అర్థం. భ్రాష్ట్రము అంటే వేపుడు చట్టి లేదా మంగలము లేదా మూకుడు.తిలలు అంటే నువ్వులు.
కాలిన మూకుడులో నువ్వులు వేస్తే పేలుతూ ఎలా పైకి ఎగురుతాయో కొందరు దుఃఖం,బాధ వచ్చినప్పుడు అణుచుకోలేక ఓ అని బిగ్గరగా ఏడుస్తూనో, సంతోషం,సంపద వచ్చినప్పుడు తామంత ఘనులం లేమని ఎగిరెగిరి పడుతూ వుంటారు.
అలాంటి వారిని ఉద్దేశించి చెప్పినదే ఈ తప్త భ్రాష్ట్ర తిల న్యాయము.
మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి వ్యక్తులు కొందరు తారసపడుతుంటారు. వారు ఏ చిన్న సంతోషం,సంపద వచ్చినా బాధ వచ్చినా ఈ ప్రపంచంలో తనకు వచ్చినట్లు మరెవరికీ రాలేదనే భావనలో ఉంటారు. అలాంటి వారి అతి ప్రవర్తనను గుర్తించి సుమతీ శతక కర్త ఏమన్నాడో చూద్దాం.
'తన కలిమి ఇంద్రభోగము/ తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్/దన చావు జగత్ప్రళయము/ తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!'
అంటే... ' తనకున్న సంపద, అనుభవించే భోగాలలో ఇతరుల అందరి కన్నా తానే గొప్ప వాడననీ, ఒకవేళ పేదరికం దారిద్ర్యం వస్తే లోకంలో తనకంటే దరిద్రుడు ఇంకెవరూ లేరనీ, తనకు మరణమే సంభవిస్తే అది లోకమే మునిగి పోయేంత ప్రమాదకరమైనదనీ అంటే తాను చనిపోతే లోకమే లేదనే పరమ మూర్ఖత్వం కొందరిలో ఉంటుంది.అలాంటి వారి మాటలెంత విచిత్రంగా ఉంటాయంటే తాను ప్రేమించిన అమ్మాయి రంభంత అందమైనదని ఒప్పించేంత విధంగా ఉంటాయి.అది తెలివి, విజ్ఞత అనిపించుకోదు.వారి తెలివి తక్కువ తనం, మూర్ఖత్వం, అజ్ఞానం, దేనికైనా అతిగా స్పందించే స్వభావం అని అర్థం అవుతుంది. అలా వారి భావనలు, అభిప్రాయాలు వారి వరకే ఉంటే గొడవే లేదు కానీ అది అందరికీ తెలిసేలా, అందరూ గుర్తించేలా , ఎలాగైనా అంగీకరింప చేసేలా ఉంటాయి.
ఇలాంటి వ్యక్తిని మన ఇళ్ళల్లో 'ఏదొచ్చినా పట్టలేడనీ' ,'వీడికి ఆన్నీ ఎక్కువే ' నని 'అతి చేస్తున్నాడని' 'ప్రతిదీ భూతద్దంలో చూస్తాడని'అనడం వింటుంటాం.
మొత్తంగా వీరిలో దేన్నీ తట్టుకునే మానసిక స్థితి లేదని అర్థం చేసుకోవచ్చు.
అలాంటి వారిని చూసే ఈ న్యాయము పుట్టి వుంటుంది. కవులు ఇలాంటి పద్యాలు రాసి వుంటారు.
ఇలా అందరిలో నవ్వుల పాలు కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి