ఊర పిచ్చుక(బాల గేయకథ);- ఎడ్ల లక్ష్మి
ఊరు పల్లెలు తిరిగి ఊర పిచ్చుక
బీర బీర వచ్చింది చిట్టి పిచ్చుక
ఇటు అటు చూసింది చిన్న పిచ్చుక
గచ్చు సూర్లో దూరింది ఊరపిచ్చుక

పీచు నార తెచ్చి చిన్న గూడు కట్టింది
మా ఇల్లంతా తిరుగుతాది ఆ పిచ్చుక
మేము వరి గొలుసులు తెచ్చి కట్టుతే
దానిమీద వాలి బుక్కుతుందా పిచ్చుక

ఆ గూటిలోన గుడ్లు పెట్టి పిచ్చుకమ్మ
గుడ్ల మీద పొదిగింది తల్లి పిచ్చుక
పిల్లలేమో చేసింది ఊర పిచ్చుక
వసాలలోని గింజలన్నీ నోటబట్టి
గూటిలోని పిల్లలకు తాను పెట్టింది

ముద్దు ముద్దుగా చూస్తూ చిట్టి పిచ్చుకలు
చిన్నగ మెల్లెగా రెక్కలిప్పి లేసినాయి
అటు ఇటు ఎగురుతూ గూడేమో వదిలి
వేరే చోటికెళ్లిపోయినాయి చిట్టి పిచ్చుకలు


కామెంట్‌లు