రేపటి కోసం చీకటి రెప్పల
తెర తీసిన తూరుపు....
ఎన్ని మనసులకు
కోరికలు తీర్చే ఘడియలను
కానుకగా తెస్తోందో!
ఎన్ని మమతలకు
తృప్తిని పువ్వులతో
పొట్లం కట్టి తెస్తోందో!
ఎన్ని కలలు కన్న కనులకు
కంటిముందు వాటిని నిజాలుగా
నిలబెడుతుందో!
ఎన్ని మౌన పోరాటాలకు
మనసు నిండే గెలుపును
అరచేత పెడుతుందో!
ఏ మది పాడే మౌనగీతానికి
ఆనందభైరవి రాగమద్ది
ఆనందింప చేస్తుందో!
తనదైన క్షణంకోసం
వేయికళ్ళతో ఎదురుచూసే
ఏ మనసును కనికరిస్తుందో!
ఏ ఎడద అనుభవించు
కొండంత సమస్యలన్నీ
దూది పింజలా ఎగరేస్తుందో!
బదులు లేని ప్రశ్నలతో
సతమతమయే పేదమనసు ముంగిట
ఏ పరిష్కారపు వెలుగు చూపుతుందో!
అందరినీ ఆత్మబంధువులా
కాచి రక్షించు ఆదిత్యుని
కరుణా కటాక్షం అందరికీ
అందించే అద్భుతమైన ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి