ఊరించే ఊహల్లోకి పయనం
గాలిలో తేలుతూ సాగి
మబ్బుల పల్లకి ఎక్కి
తూరుపు వైపే గమనం
ఎదురొచ్చిన కలను చూసి
ఎద నిండి కన్నులు మూసి
పద పదమని తొందర చేసి
మది నింపి తలుపులు వేసి
ఆరాధించు రూపము చూసి
వేధించు బాధల బాసి
మధురమైన భావము ఎగిసి
మొగమున హాసము విరిసె..
పదములు సాగక
హృదయము ఊగుచూ
అరుదైన ముదమును
పదిలముగా పొదివి పట్టుకుని
అణువణువూ అణకువతో
ఆదిత్యుని అనుగ్రహమును
అపురూపముగ అందుకుని
అతిశయమైన ఆనందముతో
కన్నుల నీరు నిండగ
కమ్మని భావము పొంగ
కదలివచ్చు కమలబాంధవుని
కరములు జోడించి స్వాగతిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి