ఈ క్షణాలు మనోహరంగా ఉన్నాయి
కాలమా కాసేపు ఆగవా! అన్నాను
ఆగలేదు...
భారమైన క్షణాల్ని మోయలేకున్నాను
కాలమా త్వరగా కదలవా!! అన్నాను త్వరపడనూలేదు
కష్టంలో గుండెలవిసేలా ఏడ్చాను
ఆనందంలో అమితంగా సంతోషించాను.
ఆక్రోశంతో కోపగించాను.
ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా గడిపాను.
దయ,జాలి, ద్వేషం, అసూయ,ప్రేమ
సేవా భావం, ఈర్ష్య, స్వార్థం
ఇలా ఎన్నో ఎన్నెన్నో
వస్తూ పోతూ
భూత వర్తమానాల్లో
నన్ను ఓడిస్తూ గెలిపిస్తూ
నాతో ఆడుకుంటూ ఉంటాయి.
అయినా
నన్ను దాటుకుంటూ
తనతో తీసుకుపోతూ
కదిలిపోతుందే గాని
ఒక్క క్షణమైనా ఆగదేం?
ఏ కలవరం లేక నిశ్చలంగా నిబ్బరంగా సాగిపోయే ఈ కాలచక్రంలో
నాకు పూర్తిగా తెలియని
నా వంశవృక్షం
ఎప్పటికప్పుడే కలిసిపోతూ ఉంది.
వర్తమానంలో ఉన్న నేను
ఏదో రోజు గతంలోకి
నా వాళ్లకు కూడా తెలియనంత లోతుల్లోకి కాలచక్రంలోకి
ఓ మరణ మార్గంలో
కలిసిపోతాను ఏదో ఒక రోజు
పోయినా మిగిలిపోయేలా...
ఆదర్శంగా....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి