తెలుగు మాష్టారు పాఠం చెప్తూ పురాణప్రసిద్ధ జంటల పేర్లు చెప్పండి అని అడిగాడు. "లవకుశులు బలరామ కృష్ణులు రామ లక్ష్మణులు సుందోప సుందులు ...""బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకో కొత్త జంట పేర్లు చెప్తా.వారు మీకు తెలుసా?హంస డింభకులు".
"అంటే పక్షుల పేర్లా సర్ అవి?"
"కాదు.జరాసంధుడి ముఖ్య సేనాపతులు.కంసుని ఎవరు చంపారు?" కృష్ణుడు అని పొలోమని అరిచారు పిల్లలంతా! కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోడానికి జరాసంధుడు హంస డింభకులను పంపాడు.వారి ధాటికి కృష్ణ బలరాములు తట్టుకోలేక పోయారు.అందుకే కృష్ణుడు ఓపుకారుని షికారు కొట్టించాడు."హంసుడు చనిపోయాడు అని ".అంతేఆపేరున్న రాజు నిజంగా చనిపోతాడు. ఇది నమ్మిన డింభకుడు తన ప్రాణమిత్రుడు లేడని తెలుసుకుని హతాశుడై జలసమాధి అవుతాడు. ఇది తెలుసుకున్న హంసుడు కూడా జలసమాధి లోకి వెళ్లి పోతాడు.
ఇక చరిత్రలో అలెగ్జాండర్ కి అత్యంత ప్రియమైన మిత్రుడు హెఫాయిస్టీన్ చనిపోతే పూర్తిగా కుంగిపోతాడు.రక్తసంబంధం లేకున్నా స్నేహబంధం మిన్న అని తెలుస్తోంది కదూ?🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి