మహిళకు నీరాజనం

 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాజమండ్రిలో స్వరరాగ అర్చన వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సృష్టికి జీవం పోసిన మహిళకు నీరాజనం అనే కార్యక్రమానికి సాహితీ బృందావన విహార వేదిక వ్యవస్థాపకులు, సున్నితం రూపకర్త ప్రముఖ సాహితీవేత్త,  స్వరరాగార్చన నిర్వాహకులు ఆహ్వానం మేరకు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెకు వన ఘన స్వాగతం పలికి  శాలువా మెమొంటో గల మాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  శ్రీమతి నెల్లుట్ల సునీత మాట్లాడుతూ గత సంవత్సరంలో మహిళలు సాధించిన విజయాలను వేడుకగా ఈ రోజున జరుపుకుని భవిష్యత్తులో ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఇక్కడ మహిళలు  చర్చించుకోవాలని అన్నారు.
పురుషులతో పోటిపాటిపుతూ అన్ని రంగాల్లో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఇంకా మహిళలపై అత్యాచారాలు ఆగని దాడులు జరుగుతున్నాయని. ఈ సమస్య మూలాలను తెలుసుకొని ఘటనలు దారుణాలు జరగకుండా పటిష్టంగా చట్టాలను  సరియైన సమయంలో సరిగ్గా,అమలుపరచాలని అన్నారు.
 మహిళలకు మహిళ  హక్కుల మీద అవగాహన సదస్సులు పాఠశాల స్థాయి నుండి, కళాశాల స్థాయి, వరకు అలాగే పట్టణ, నగర ప్రాంతాలలో చట్టాలు, సెక్షన్స్ ,హక్కుల్ని గురించిన అవగాహన సదస్సులు పాలకులు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మహిళ సాధికారత అంటే అన్ని ప్రాంతాలలో లింగ, వివక్షత అనే అంతరాలు లేకుండా సమాన హక్కులు సమానంగా అందరూ పొందినప్పుడే నిజమైన మహిళా సాధికారత అని అన్నారు.మహిళా
శక్తిని ఉపయోగించుకున్నప్పుడే ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ అభివృద్ధి సాధిస్తుంది.అని అన్నారు
సాహితీ బృందావన విహార వేదిక నుండి అందిస్తున్న  సాహితి, తెలుగు భాషా పరిరక్షణ, సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ మహిళా పురస్కారంతో ఈ సత్కారం జరిపిన స్వరరాగార్చన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ సాహితీవేతలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు , సునీతను అభినందించారు. గాయనీ, గాయకులు గానలహరితో అలరించారు సినీ నటులు, సినీ దర్శకులు, కవులు, కళాకారులు, నాటక, రంగస్థలం నటులు, వివిధ సేవా సంస్థ వ్యవస్థాపకులు 200 మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు