గోవు!అచ్యుతుని రాజ్యశ్రీ

 టీచర్ జంతువుల గూర్చి పాఠం చెప్తూ "పిల్లలూ!మనం ఏఏ జంతువులను పూజిస్తాం?" అని అడిగితే అంతా"గోమాత ఆవుని" అని ఠక్కున జవాబిచ్చారు. పురాణాలు కూడా గోవు విశిష్ఠతను తెలుపుతున్నాయి.అమ్మ పాలంత శ్రేష్ఠమైనవి ఆవుపాలు.టీచర్ ఇలాచెప్పసాగింది"అమెరికన్ ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ తన బాల్యం లోని సంఘటనని ఇలా వివరించాడు. "ఓరైతు దగ్గర ఆవుని కొనాలని మా పెద్దలు వెళ్లారు. ఆవు ఏజాతికి చెందినది అని  అడిగితే ఆరైతు ఇచ్చిన జవాబు ఇది" అయ్యా!నాకు ఏమీతెలీదు.ఆవు ఎన్నిపాలు ఇస్తుంది  వెన్న ఎంత వస్తుంది  అని ఏమడిగినా"నాకు తెలీదు"అనే జవాబు ఇచ్చాడు."అది ఒక్క చుక్క కూడా దాచుకోకుండా నాకు ఇస్తుంది. ఇది ఒక్కటే నాకు తెలుసు. "ఈఉదంతం చెప్పి ఐసన్ హోవర్ తన ప్రజలతో ఇలా అన్నాడు "దేశాధ్యక్షునిగా నాజీవితమంతా ప్రజాసేవకే అంకితం చేస్తాను.నేను కూడా  ఆవు లాంటివాడి నే!"అంతే ప్రజలు చప్పట్లతో ఆయనకు జేజేలు పలికారు.ఏదేశంలోనైనా నాయకుడు అనేవాడు ఆవులాగా సాధుస్వభావంతో ఉండాలి. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలి.అందుకే అలాంటి ప్రపంచ దేశాలనేతలని ప్రజలు నేటికీ తల్చుకుంటూ ఉన్నారు. ఆఖరుగా టీచర్ చెప్పిన సూక్తి ఏమిటో తెలుసా?"భవిష్యత్తులో మీరు కూడా పటేల్ లాగా దృఢసంకల్పం కలిగి ఉండాలి. లాల్బహద్దూర్ శాస్త్రి జీ లాగా నిరాడంబరంగా దేశసేవలో తరించాలి." అలాగే టీచర్  అంటూ పిల్లలు అంతా అరిచారు. ఇలాంటి సంఘటనలు విషయాలు ఇంట్లో పెద్దలు చెప్పాలి. అలాంటి పుస్తకాలు చదివించాలి.🌹
కామెంట్‌లు