టీచర్ పాఠం చెప్తూ "వన్యప్రాణులంటే ఏవి?" అని అడిగింది. సింహం పులి..ఇలా టకటకా చెప్పారు. "మీకు ఇష్టమైన జంతువు ?" పిల్లలంతా "మాకు కోతి ఏనుగు ఇష్టం "."ఏనుగంటే ఎందుకిష్టం?" "ఏనుగు అంబారీ ఏనుగుపాట మాకు ఇష్టం!వినాయకుడి మొహం ఏనుగు.తెలివి తేటలు దాని సొత్తు. "టీచర్ అంది"నిజమే అది ఎంత తెలివిగలది ఐనా కొన్ని విషయాల్లో అమాయకంగాఉంటుంది.చిన్నప్పటినుండి ఏనుగు గున్నని తాడు లేక సన్న గొలుసు తో కట్టివేస్తారు.అది బాగా పెరిగి పెద్ద ఐనాకూడా తను గొలుసు తెంపుకునే శక్తి ఉన్నాసరే "నేను బందీని.పారిపోలేను" అనే భావంతో గొలుసు తెంపే ప్రయత్నం చేయదు. అందుకే చిన్నప్పుడుఏభావాలు పిల్లలలో నాటితే అవే మొలకెత్తి స్థిరంగా ఉండిపోతాయి.
అందుకే పూర్వం పిల్లలకి నీతికథలు ధైర్యం ఉత్సాహం కలిగించేవి చెప్పేవారు. దైవభక్తి దేశభక్తి నూరిపోశారు బాల్యంలో నే.పాజిటివ్ గా ఆలోచించడం ఎవరైనా మనల్ని విమర్శిస్తూ ఏదైనా అన్నా మాట్లాడకుండా ఉంటే తగాదాలు రావు." టీచర్ మాటలు బానే బుర్ర లోకి ఎక్కి పిల్లలు ఏమీ అనలేదు. 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి