కలిమికి గర్వపడనిది...
లేమికి కలత చెందనిది....
నిర్మల కుసుమంలా...
పరిమళించేది బాల్యం !
ఆటల సందడే గానీ...
ఆకలి - దప్పులు గుర్తుకు రావు
కల్లలెరుగనిది, ఎల్లలులేనిది...
బాలలహృదయం... !
స్వచ్ఛమైన ఆ నవ్వులో....
నిన్న,రేపుల నిశ్చింత...
ప్రతిఫలిస్తుంది... !
బాల్యానికున్న...
గొప్పతనమే యిది !
కొనుక్కో నవసరం లేని...
కోట్లవిలువైనబాల్యానందమిది
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి