ఉందిలే మంచికాలం ముందుముందునా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కల చెదిరిందా
కలతచెందకు
కమ్మనికలలు మరలా వస్తాయిలే

పేకమేడ కూలిందా
పరెషానుపడకు
పక్కామేడ త్వరలో కట్టుకుంటావులే

ఆశలు గల్లంతయ్యాయా
ఆరాటపడకు
అనుకూలించినపుడు ఆశయాలు సాధించుతావులే

చెట్ల ఆకులురాలాయా
చింతించకు
చిగురాకులు త్వరలో తొడుగుతాయిలే

ఆటలో ఓడిపోయావా
అలజడిచెందకు
అభ్యాసంచెయ్యి విజయాలు వరిస్తాయిలే

అనుకున్నది జరగలేదా
అలమటించకు
అన్నీ మంచికని అనుకోలే

కవిత కమ్మగాకుదరలేదా
కుమిలిపోకు
కాలంకలిసొస్తే కడుమేటిగా కూరుస్తావులే


కామెంట్‌లు