తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
మంచినీళ్లతో మనుషుల్ని
మంచు గడ్డలతో మనసుల్ని 
తయారు చేస్తున్నాం!!?

గాలిని గనుల్లోంచి
గడ్డలు గడ్డలుగా వెలికి తీసి
కరిగించి మన బిడ్డలకు
కలిపి తినిపిస్తున్నాం!!

అద్దాలన్నీ ఒకటే
అద్దాలకు నీవు అవతల ఉంటావా
ఇవతలో ఉంటావో తేల్చుకో!!?

మట్టిని కరిగించి
త్రాగుతున్న చెట్లన్నీ
చీకట్లో మత్తుగా తూలుతున్నవి!!!

వెలుగు నిద్దుర మత్తు వదిలి
సింహంలా ఆకలితో
కోపాన్ని తింటున్నది!!!

చీమలు భద్రతకు కాదు
ఆహార భద్రతకు పాకులాడుతున్నాయి
ఆకులు రాలుతాయి
చినుకులు పేలుతాయి
వేర్లు ఆవిర్లను దాచుకుంటాయి!!!

ముక్కలు ముక్కలుగా నరికి
దీపాలను ఆర్పిన
వెలుగుతున్న మొండిది వెన్నెల!!

పరిమళాలకు
కళ్ళు చెవులు ఉండవు
ముక్కు మాత్రమే ఉంటుంది!!

తుమ్మితే తప్ప
రాలిపడని పరిమళాలు
ఏరుకునేందుకు పూల తోటల్లో
సీతాకోచిలుకల్లా మనం వాలిపోతున్నాం!!

కొత్త బట్టలు తొడిగిన పగలు
ఇరువది నాలుగు గంటలకు
తిరిగి ఇంటికి వచ్చింది!!
ఏం సందేశం తెచ్చిందోనని
ఉత్తర దక్షిణ దిశలు ఉలిక్కి పడ్డవీ!!

అవయవాలను దానం చేస్తామేమో
ప్రాణం తిరిగి పోస్తామేమో కానీ
యవ్వనాన్ని తిరిగి తీసుకురాలేం
సముద్ర గవ్వాలన్నీ తిరిగి
సముద్రంలో కలిసినట్లు!!?

కేవలం మనిషి గురించి మాట్లాడేది
ఆధ్యాత్మికం!!
మనసు గురించి మాట్లాడేది-జ్ఞానం!!! మొత్తం
విశ్వం గురించి మాట్లాడేది
విజ్ఞాన శాస్త్రం!!?

చక్కెరను కనిపెట్టాం కానీ
తేనే ప్రకృతి తయారు చేసింది
మన తెలివితేటలు అంతే!!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
District president Sri Sri kalavedika
8309529273

కామెంట్‌లు