శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 నారాయణుని ఊరువు నుంచి 
 
పుట్టిన ఆమె,మనిషి ఉరంలో నివసించేది.ఋగ్వేదంభారత భాగవత అగ్ని విష్ణు హరివంశ పురాణాలలో ఊర్వశి పుట్టుక గూర్చి కథలున్నాయి.సముద్రమధనం  సమయంలో జన్మించిన అప్సరస.నారాయణముని ఘోరతపస్సు చేస్తుండగా ఇంద్రుడు తపోభంగం కై అప్సరసలను పంపాడు.ముని కోపించి వారందరికన్నా మిన్న ఐన సౌందర్య రాశి ని సృష్టించాడు.ఆనారీ అద్భుత సౌందర్యం కి వారంతా ని‌స్తేజులైనారు.ఆమెని వారి తో ఇంద్రసభకి పంపాడు.సభలో నాట్యం చేస్తూ ఆమె ప్రతిష్ఠానపుర రాజు పురూరవునిపై మరులు గొంటుంది.ఇంద్రుడు శపించాడు.నాలుగేళ్ళు పురూరవుని భార్యగా ఉంది.ఆమె మాయమైంది.అర్జునుడిని నపుంసకుడు కమ్మని శపించింది ఊర్వశి.
ఊహాపోహ అనే పదం ఉంది.ఊహ అంటే అనుకూల తర్కం. అపోహ అంటే ప్రతికూల తర్కం.అంటే ఏవిషయంపైన గూడా నిశ్చయం కాని దశ!
యగ్న కార్యాలు చేసేవారిని ఋత్విజులు అంటారు.వీరు 16మంది.అధ్వర్యు ఉద్గాతా బ్రహ్మ ముఖ్యులు.

కామెంట్‌లు