వైద్యరాక్షసమ్;- డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 ఎర్రతోలు కప్పుకున్న తోడేళ్ళు
తెల్లకోటులను కాటేస్తున్నాయి.
ప్రీతిపాత్రమైన చదువు కోసం జీవితం తెల్లవారిపోయింది.
వేధింపులు మామూలై,
సాధింపులు తలమాసిన క్షణాన
ఒక గుండె ఆగింది.
విద్యావనాల్లో రక్తం రుచి మరిగిన తోడేళ్ళు
యధేచ్ఛగా విహరిస్తున్నాయి.
నవనాగరిక ముసుగులు ధరించిన సైంధవులు మూకలు మూకలుగా పెరిగిపోతున్నారు.
బిడ్డల మానాలు,ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే,
తల్లిదండ్రుల రోదనలు అరణ్య రోదనలే అవుతున్నాయి.
రక్తం పంచుకున్నవారు నిశ్చేష్టులై స్థాణువులవుతున్నారు.
షరా మామూలు గానే విచారణ  జరుగుతున్నది.
నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న ఊకదంపుడు మాటలు,
చెవులు పగులగొడుతున్నాయి.
గండ్రగొడ్డలితో పరశురాముడో
కోదండంతో శ్రీరాముడో
సుదర్శనచక్రంతో కృష్ణుడో
పులి మీద జగన్మాతో రావాల్సిందే.
పాపం పండాల్సిందే.
కామెంట్‌లు