తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు.

 తృతీయ ప్రకృతి.
ఇది ప్రపంచవ్యాప్తమైన జాతీయం. ఈ ప్రకృతి శబ్దాన్ని ప్రపంచార్ధములో వాడుతారని గౌ "బూదరాజు రాధాకృష్ణ గారు"వచించారు. జగత్తు నిరంతరాయంగా, సజావుగా కొనసాగాలంటే రెండు ప్రకృతులవసరం. ఒకటి పురుష ప్రకృతి, రెండోది స్త్రీ ప్రకృతి పురుషుడు బీజం. స్త్రీ క్షేత్రంగా భావిస్తాం. మూడో ప్రకృతి కూడా ఉంది. అది నపుంసకం-న స్త్రీత్వం-అంటే నపుంసకుడు కావచ్చు-మాచమ్మ కావచ్చు. పురుషత్వము లేనివాడు కానీ, స్త్రీలాగా సుకుమారంగా వర్తించే దానిని నపుంసకుడంటారు. వీరిది తృతీయ ప్రకృతి. అదే మాదిరి ఏ స్త్రీ నైతే సంతానోత్పత్తికి, సంసారానికి పనికిరాని వ్యక్తులను తృతీయ ప్రకృతి. ఎగతాళిగా"వాడిది తృతీయ ప్రకృతి లెండి"అని అంటారు.
ఆమె తృతీయ ప్రకృతి. ప్రపంచ ప్రకృతికి వ్యతిరేకం-బ్రహ్మ సృష్టి కాదనుకుంటాను. బ్రహ్మదేవుడు ప్రజాపతులను సృష్టించి, కవి-ప్రపంచాన్ని సృష్టించాడు. దీనికి వృద్ధి ఉంది. నిలకడ లేదు.

కామెంట్‌లు