సీతారాముల కళ్యాణం చూచి తరిద్దాం ! రండి !!;-" కావ్యసుధ "
మానవుడిగా ఉండి
మహానియుడుగా
ఎలా ఎదగాలో..........
మానవులకు నేర్పించిన
మహానీయమూర్తి.
మానవుడి మాధవుడు
అన్న నిజాన్ని తేటతెల్లo
చేసినవాడు శ్రీరాముడు.                                                                     
ఎన్నో జన్మల పుణ్యఫలంగా
భావించే మానవ జన్మను
ఎలా సద్వినియోగం   చేసుకోవాలో
రాముడి జీవనయానం
ద్వారా నేర్చుకోవాలి.

శ్రీరాముని ఆదర్శం
పితృ వాక్య పరిపాలనము
భాతృ ప్రేమవాసల్యం
శ్రీరామచంద్రుని
అవతార పరమార్ధాలే !
ధర్మము మూర్తీ వించిన వాడు.
విశ్వాన్ని పరిపాలించేది ధర్మం

అదిగో.... అల్లదిగో....
భద్రాద్రిలో... చైత్ర శుద్ధ నవమి 
సీతారామ కళ్యాణ మహోత్సవం.......
ఆకాశం ఓ పెద్ద చలువ పందిరి
భూలోకమంతా కళ్యాణ మండపంలా.....
వెలిగిపోతోంది.
సిగ్గుల మొగ్గ సీతమ్మ మెడలో
సకల గుణాభిరాముడు శ్రీరాముడు
మూడు ముళ్ళు వేస్తున్నాడు
మంగళ వాయిద్యాలు                                                    మిన్నంటుతున్నాయి
అక్షింతలు ముత్యపు                                                                                      చినుకులు అవుతాయి
సీతమ్మ మాయమ్మ
రామయ్య మాఅయ్య
సీతారాముల కళ్యాణము 
చూతము రారండి !!
మంగళకరమైన కళ్యాణ గీతం
మధుర స్వరం తో 
వినిపిస్తోంది........

సీతాదేవి హృదయం
నిండా రాముడే....
శ్రీరాముని హృదయం
నిండా సీతాదేవియే.....…...
ఆలుమగల అన్యోన్యం........
పరమశివుడు మెచ్చితే ధన్యం

కళ్యాణం అంటే.....
సీతారాముల కళ్యాణం  !
కళ్యాణ పరమార్థమైన
దాంపత్యానికి దివ్యత్వాన్ని
ఆపాదించింది వారిద్దరే !!
సీతారాముల కళ్యాణం                                                                                         

జగత్కకళ్యాణం !!!

సీతారామ దంపతులు
భార్యాభర్తల అనుబంధానికి
అనురాగానికి ప్రేమస్పదమైన
నిర్వచనాన్ని
ఇచ్చిన ప్రేమ మూర్తులు.
ప్రతి దంపతులు సీతారాముల్లా
జీవించగలిగితే.....
సమాజంలో ధార్మిక జీవనం
దాంపత్యవైశిష్ఠం వెల్లి  విరుస్తుంది.
దేశమంతా అప్పుడు
సుఖశాంతులతో
వర్ధిల్లే అవకాశం ఉంది.

" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
9247313488 : హైదరాబాదు
కామెంట్‌లు