నిశీధిలో తల్లడిల్లిన
మనసుకు.....
కన్నులు తుడిచే ఓదార్పులా
కలవరంతో తడిసిన కళ్ళకు
వచ్చి చేరుకునే
చల్లని మెరుపులా...
కన్నీటి కడలిలో కదిలే
కలల నావకు దొరికిన
మధుసీమల తీరంలా
పిలిచి పిలిచి అలిసిపోయిన
గొంతుకు... చేరువనే వినపడ్డ
పలవరించిన పలకరింపులా...
కమ్ముకున్న చీకటిలో
కాసింత దూరానే కనపడ్డ
గోరంత దీపంలా...
ఒంటరైన క్షణంలో
నేనున్నానంటూ చేయందించే
ప్రియతమ నేస్తంలా
నలిగిన మనసులకు
తలనిమిరి ఓదార్చే
కొండంత అండలా....
తూరుపు గగన వీధిలో....
కొండల మధ్యన తొంగిచూసే
లోకబాంధవుడి ఆగమనం
నిదరోయిన ఆశల మేల్కొలిపే
మహోదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి