తెలుగుజాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 అతలాకుతలం:-
దీనికొక రూపాంతరం ఉన్నది. అతలాకుతలం. దీనికి అర్థం తల క్రిందలు. ఏదైనా విషయం సవ్యంగా లేకపోతే అది అతలాకుతలంగా ఉంది అంటారు. అతలాకుతలం కావటం అంటే విసిగి వేసారటం. అలసట చెందటం అన్నమాట. తలక్రిందులు లేదా అయోమయం. కుతలం అంటే భూమి అని అర్థం. భూమి కింద 7 లోకాలు ఉన్నాయని పురాణాలు వివరిస్తున్నాయి. అతలం, వితలం, సుతలం, తలా తలం, రసాతలం, మహా తలం, పాతాళం అనేవి. ఇదేవిధంగా ఊర్ధ్వ లోకాలు ఉన్నాయి. అవి భూలోకం, భువార్లోకం , సువర్లోకం, మహా లోకం, జనోలోకం, తపోలోకం, సత్య లోకం, ఏడేడు 14 లోకాలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రంలో ఏ లోకం ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసేటట్లు లేదు. ఇవి మన వేదాలలో చెప్పినవి. అతలాకుతలం అంటే అయోమయం అని అర్థం కదా! "నా స్థితి అతలాకుతలమయ్యింది"అంటే అయోమయ స్థితి ఏర్పడిందని భావించాలి.

కామెంట్‌లు