ప్రతిరోజూ పరిశ్రమం
ప్రతిక్షణమూ నిరాదరణం
కంటి చెమ్మ ఆరిపోదు
కలల తీరం చేర రాదు
రెప్పచాటు వేదన
గుండె లోతు వేదన
పెదవిపై పలుచని నవ్వులు
గొంతులో ఆగిన వెక్కిళ్ళు
వదులుకోలేని విలువలు
వదిలిపోని అపనిందలు
ఎన్ని భరిస్తే పచ్చని కాపురం?
ఎన్ని త్యజిస్తే జీవితం మధురం?
ఒక చక్రం మొండికేస్తే
రెండో చక్రం తిరుగుతుందా?
ఒక అడుగు ఆగితే
మరో అడుగు సాగుతుందా?
ఆకాశానికి ఎత్తక్కర్లేదు
ఎదగనిస్తే చాలు..
రాయితీలు ఇవ్వక్కర్లేదు
అవకాశం ఇస్తే చాలు
అడుగులకు మడుగులా?
అక్కరలేదు
ఆ మది గుడిలో దైవంలా
ఉంటే చాలు
స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలు
సిరులు పండించుకోవడానికే
బ్రతుకులు నిస్సారం చేసుకోమనా?
ఆహార్య విహారాలు
అపాయాల పాల్జేయక
అందరిలో గౌరవం నిలుపుకోవడానికే
ప్రతినాణేనికీ మరోవేపుంటుంది
ప్రతి జీవితంలో మరోకోణముంటుంది
ప్రతి మనిషికీ అలోచించే విచక్షణుంటుంది.
మంచీ చెడు ఎంచుకోవడం
మన విజ్ఞత
మంచి రేపు వస్తుందని ఆశించడం
ఎప్పటికీ ఆకాంక్ష!
ప్రతిరోజూ మహిళదే
ప్రత్యేకంగా మలచుకుంటే
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి