ఆరోజు జి.కె.క్లాస్.పిల్లలకి క్విజ్ పెట్టిన తర్వాత కొన్ని పుస్తకాలు ఇచ్చి "ఇవి చదివి అందులో నచ్చిన విషయం టూకీగా చెప్పండి " అంది.శివా ఓపుస్తకంలో కొన్ని టిట్బిట్స్ చదివాడు."నేను ఓప్రశ్న అడుగుతాను.ఓమ్యూజియం కేవలం అహ్మదాబాద్ లో మాత్రమే ఉంది. దాన్ని ఓమహిళ నెలకొల్పారు.ఎవరామె?" పిల్లలంతా నోటి కి వచ్చిన జవాబులు చెప్పారు. టీచర్ కి కూడా తెలీదు. "శివా!మాపప్పులన్నీ ఉడికాయి.నీవే చెప్పు." అంతే శివా చెప్పసాగాడు.
"అహ్మదాబాద్ లో ఉన్న ఆమ్యూజియం పేరు మ్యూజియం ఆఫ్ టెక్స్ టైల్స్!గీరాబెన్ శరాభాయ్ నెలకొల్పారు. 40ఏళ్ళు కృషి చేసి 15వశతాబ్ది నుంచి నేటి దాకా మనభారతీయ వస్త్రాలను గూర్చిన మ్యూజియం ఇదే! అపరకుబేరుల ఇంటపుట్టిన ఈమె చాలా సీదాసాదాజీవితం గడిపారు. కానీ ఆమె ఎప్పుడూ ఆమ్యూజియం ని గూర్చి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కనీసం ప్రచారం కూడా చేయలేదు. కేవలం ఒక బొమ్మ చిత్రంతో మన భావాలను ఇతరులకు తెలియపర్చవచ్చుఅనేదామె!ఈమె ఆధ్వర్యంలో సృజింపబడిన కేలికో ప్రకటన కి ఎన్నో జాతీయ అంతర్జాతీయ బహుమతులు లభించాయి. ఈమె జీవితచరిత్ర చదవండి అందరూ!" టీచర్ తో సహా అంతా చప్పట్లు కొట్టి శివాని అభినందించారు 🌹
మ్యూజియం ఆఫ్ టెక్స్ టైల్స్!గీరాబెన్ శరాభాయ్-- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి