నీ మార్గమునే... ; - సి హేమలత (లతాశ్రీ )పుంగనూరు
మయూరమై నా మనసే
 ఆడేనూ నీ నీడన/
సుఖశాంతులు ప్రతిరోజు
 కలిగేనూ నీ నీడన//

నీవు నడుచు మార్గమునే
నడిచెదనూ కలకాలము/
నా తోడుగ అవకాశము
నిలిచేనూ నీ నీడన//

పదుగురికీ మంచి చేయు
 మనసున్నా మారాజువి/
నీ మాటలు వేదాలుగ
మిగిలేనూ నీ  నీడన//

ఆకాశపు హర్మ్యాలను
నేనెప్పుడు నిర్మించను/
బోధనలై నీ సేవలు
మసిలేనూ నీ నీడన//

ఆనాడూ ఈనాడూ
మానవుడే మాధవుడూ/
ఈ లోకము ఆ పలుకులు
తలిచేనూ నీ నీడన//

నీబోధన ఫలితముగా
వ్యసనాలే చిత్తాయెను/
కుర్రకారు సంతసించి
వదిలేనూ నీ నీడన/

కష్టాలకు లక్ష్యాలను
వదిలిపోని ధీరుడవూ/
నీ సహచరిగ లతాశ్రీ 
నడిచేనూ నీ నీడన//


కామెంట్‌లు