న్యాయాలు -79
తప్త పరశుగ్రహణ న్యాయము
******
తప్త అనగా వేడిచేయబడిన,కాచబడిన అని అర్థం.పరశు అంటే గండ్ర గొడ్డలి, ఆయుధము, వజ్రము అనే అర్థాలు ఉన్నాయి.గ్రహణ అంటే పట్టుకొనుట, స్వీకరించుట,పలుకుట, ధరించుట అనే అర్థాలు ఉన్నాయి.
తప్త పరశుగ్రహణ అంటే వేడిచేయబడిన గండ్రగొడ్డలిని పట్టుకొనుట అని అర్థం.
అయితే వేడి వస్తువులను పట్టుకోవడం సాధ్యం ఎలా అవుతుంది అనే అనుమానం రావచ్చు. కానీ మన ఇంట్లో వంట చేసే అమ్మ, బామ్మ అమ్మమ్మలను చూస్తుంటాం. వేడి పాత్రలను దింపడానికి, వాటిలో ఉన్నవి కలపడానికి రక్షణగా మసిబట్ట,పట్టుకారు లాంటివి ఏమీ లేకుండానే చేతులతో పట్టుకొని అవలీలగా ఆ పనులు చేయడం.
చూసే మనకు మస్తు ఆశ్చర్యం కలుగుతుంది కదా! కానీ అలవాటు, అభ్యాసం వలన అది సాధ్యం అవుతుందనే విషయాన్ని ఈ న్యాయం చెబుతుంది.
క్రమ క్రమంగా వేడి వస్తువులను పట్టుకొనుట అలవాటు చేసుకుంటే చివరకు కాలుతున్న ఇనుప గొడ్డలిని కూడా పట్టుకొనవచ్చును. అంటే "అభ్యాసం కూసు విద్య" అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
'అభ్యాసం కూసువిద్య 'లో కూసు అంటే చిన్న అని అర్థం.కూసువిద్య అంటే చిన్న చిన్నగా అభ్యాసం చేస్తూ వుంటే విద్య సులభంగా వస్తుందని అర్థం. అభ్యాసం వలన ఎంతటి కష్టతరమైన విద్య అయినా సులభంగా పట్టుపడుతుందనే అర్థంతో అభ్యాసం- కూసువిద్య అనే పదబంధాన్ని ఉపయోగిస్తారు
దీనికి సంబంధించిన తెలుగు సామెత కూడా ఉంది. "తెలిసే వరకే బ్రహ్మ విద్య-తెలిసిన తర్వాత కూసు విద్య'.అంటే తెలియనంత వరకు అమ్మో బ్రహ్మ విద్య సాధ్యం కాదని భయపడుతుంటాం. నెమ్మదిగా అభ్యాసం చేశాక భలేగా వచ్చేసిందని సంబర పడుతుంటాం కదా!.
దీనికి సంబంధించిన వేమన పద్యాన్ని చూద్దాం... 'అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు/తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/ విశ్వదాభిరామ వినురవేమ!'
అంటే పాడగా పాడగా రాగం చక్కగా కుదురుతుంది.అలాగే వేపాకును రోజూ తింటూ ఉంటే ఆ వేపాకు చేదుగా అనిపించదు. ఏ పనైనా రాదనుకుంటే రాదు.నేర్చుకోవాలనే సంకల్పంతో నిత్యం సాధన చేస్తే ఏ పనైనా చేయగలం.ఈ లోకంలో అన్ని పనులు చేయడం ద్వారానే సాధ్యపడతాయి. కాబట్టి సాధనే ముఖ్యమని తెలుసుకోవాలి.
మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న కొందరు వ్యక్తులు శారీరక వైకల్యాలను కూడా అధిగమించి ఎన్నో అద్భుతాలు సృష్టించారు.ఎన్నో ఆవిష్కరణలు చేశారు. వాటి వెనుక అకుంఠిత దీక్ష, నిరంతర సాధన ఉన్నాయి.
ఉన్నత శిఖరాలకు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాధనే ముఖ్యమని ఈ తప్త పరశుగ్రహణ న్యాయము ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి