సంగీత - సాహిత్య
నటనాభినయ సమ్మిళితం
వైరుధ్య సమన్వితం
శివ0... !
*******
శత్రుత్వం మరపించి
మిత్రత్వ సహజీవనం
మహిమాన్వితo....
శివతత్వం... !
******
సింహం - ఎద్దు...
నెమలి -సర్పం...
నుదుట నిప్పు, నెత్తిపై నీరు
శివ సమన్వయo.. !!
******
పురుషునిలో సగం
సమాన గౌరవం
అర్ధనారీశ్వరం.... !
అబేధO శివత్త్వం !!
*****
సృష్ఠి - స్థితులకు
పరిపూర్ణత్వం....
ఆ సదాశివుని...
లయకరతత్వం !
******
సత్వ, రజస్తమో గుణముల
త్రిసూల పాని.... !
ఆ నిర్గుణ...
లింగస్వరూపుడు !!
********
ఆద్యంత రహితుడు
భస్మ భూషితుడు
కైలాస, స్మశాన ...
సమవర్తీ... శివా !
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి