భాగ్యనగరంలో భానుడు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నాలుగునెలల తర్వాత
నిన్ననే భాగ్యనగరం తిరిగొచ్చా
ఎండగాలులు ప్రొద్దుటనుండే
ఎడాపెడా వీస్తున్నాయి తీవ్రంగా

భానుడు భాగ్యనగరంలో
భగభగమంటున్నాడు
బయటకుపోకుండా జనులనుగృహాల్లో
బందీచేస్తున్నాడు

వసంతం వచ్చిందని
కోకిలలు కూస్తాయని
మామిడిఫలాలు వస్తాయని
మల్లెపూలు వస్తాయని భ్రమపడ్డా

కోకిలముందే కూసిందని
ఎండాకాలం ముందేవచ్చింది
ఉక్కపొతతో ఉడికిస్తుంది
చెమటతో చీకాకుపెడుతుంది

రెండునెలలు 
తాపం తప్పేటట్లులేదు
బాధలను
భరించక తప్పేటట్లులేదు

కరెంటుపోతే
కడుకష్టం
ఏసీచెడిపోతే
ఎక్కువదుఃఖం

తొలకరికోసం
తపిస్తుంటా
వానలకోసం
వేచియుంటా

కాలం
మనచేతిలోలేదు
కర్మఫలం
అనుభవించకతప్పేటట్లులేదు

స్వాములవారిని
చల్లగా చూడమని
చల్లగాలులు త్వరగావీయించమని
సవినయంగాప్రార్ధిస్తున్నా చేతులెత్తి

+++++++++++++++++++++++++++++++++++++++

నాలుగు నెలల తరువాత నిన్ననే భాగ్యనగరంలో అడుగుపెట్టా. ఎండలు మండుతున్నాయి. ఉక్కపోస్తుంది. గ్రీష్మకాలం వచ్చింది. తాపం కలుగజేస్తుంది. ఈ సందర్భములో వ్రాసిన నా కవితను చదివి నాతో ఏకభవిస్తారని ఆశిస్తున్నా.

కామెంట్‌లు