సరితూగే!అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆరోజు టెన్త్ క్లాస్ వారికి ఫేర్వెల్ పార్టీ!తొమ్మిదోక్లాస్ వారంతా కలిసి స్వీట్ హాట్ పళ్ళు కూల్ డ్రింక్స్ తో టీచర్లు పిల్లలకి పంచారు.టెన్త్ పిల్లలు తమ  అనుభవాలు చెప్పారు. చాలా బాధగా ఉంది అందరికీ!"మేము మంచి మార్కులు రాంక్ తో పాసవుతాం" అని ధీమావ్యక్తం చేశారు. సోమవారం నాడు తొమ్మిదోక్లాస్ పిల్లలు ఏదో సీరియస్ గా చర్చించడం చూసి కారణం అడిగింది."టీచర్!ఇప్పుడు అమ్మాయిలదే హవా! చరిత్ర సృష్టిస్తున్నారు." ఆడపిల్లలంతా అరిచారు. ఉదాహరణలు చెప్పమని టీచర్ అడగగానే విజయ చెప్పింది "చదువు లేకున్నా ఇద్దరు మహిళలు పేపరులో ఎక్కారు. బీహార్ కి చెందిన సీతాదేవితొలి మహిళా ఎలక్ట్రీషియన్ గా స్విచ్ మొదలు ఫ్యాన్లు దాకా  రిపేరుచేసిశభాష్ అనిపించుకుంది.భర్త జబ్బు పడటంతో పసిపిల్లాడిని ఒళ్ళో పెట్టుకొని షాప్ నడుపుతోంది.
ఇక గయలో రోడ్లు ఊడ్చే చింతాదేవి డిప్టీమేయర్ గా చరిత్ర సృష్టించింది.40ఏళ్ళు చీపురు చేతబట్టి గల్లీలు ఊడుస్తూ పరిశుభ్రత నేర్పింది. 27వేల ఓట్లు ఎక్కువ పడ్డాయి ఆమెకి. కూరలు కూడా అమ్మింది."
"శభాష్ విజయా!నీతినిజాయితీ కష్టపడే తత్వం ఉన్న వారు ఏరంగంలోనైనా రాణిస్తారు.మంచి విషయం చెప్పావు" అని టీచర్ మెచ్చుకుంది 🌷

కామెంట్‌లు