" విలక్షణ కవి" వేముల ప్రభాకర్ నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 'కీర్తి పురస్కారం' ప్రధానం.
 ప్రముఖ రచయిత, విలక్షణ కవి 
విశ్రాంత సహకార జాయింట్ రిజిస్ట్రార్ వేముల ప్రభాకర్ గారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నవలా రచనకు మార్చి 28 తేదీన
వారు చేసిన కృషికి గుర్తింపుగా
'కీర్తి పురస్కారం ' పొందుతున్న సందర్భంగా....
"విలక్షణ కవి" శ్రీ వేముల ప్రభాకర్ గారు ఇప్పటి వరకు మూడు నవలలు,ఒక కథా సంపుటి, తెలంగాణ మాండలిక భాషలో వీరి కథలు అద్భుతంగా ఉంటాయి. వరంగల్ నుండి వెలువడిన "జనధర్మ" వారపత్రికలో  కొంతకాలం "కాలజ్ఞానం"అనే శీర్షిక నిర్వహించారు. సాహితీ ప్రపంచానికి వరంగల్ జిల్లాలోని సాహితీమూర్తులను పత్రిక ద్వారా పరిచయం చేశారు.
ఆరు కవితా సంపుటుల
స్వీయ రచనలతో పాటు
రెండు సాహితీ గ్రంధాలు 
ఒక మాస పత్రిక (సహకార సమాచారం ) వారి సంపాదకత్వంలో వెలువడ్డాయి.
వీరి సోదరుడు కీ.శే. వేముల పెరుమాళ్ళు గారి పెక్కు రచనలు ముఖ్యంగా ప్రసిద్ధ గ్రంధం 'తెలంగాణ జాతీయాలు' రెండు ఎడిషన్ల ప్రచురణలో కూడా
వీరి కృషి ఉంది.
రాయికల్ గ్రామానికి
చెందిన వాగ్గేయకారుడు
కైరం
భూమదాసు(1875-1950) జీవితం, రచనలు ఆధారంగా
వీరు రచించిన నవల
'వరకవి భూమాగౌడు ' 
ప్రముఖ సామాజిక తత్త్వవేత్త
శ్రీ బి.ఎస్. రాములు 50 వ సాహితీ ఉత్సవాల సందర్బంగా 2017 లో జరిగిన పోటీల్లో ఉత్తమ నవలగా ఎంపికైంది.
ఆచార్య రావికంటి వసునందన్ సప్తతి మహోత్సవాల్లో(2019) కూడా దీనికి పురస్కారం లభించింది.
ఇప్పుడు తెలుగు విశ్వావిద్యాలయం కూడా
ప్రభాకర్ గారి కృషిని గుర్తించి
వీరికి 2020 సంవత్సర
'కీర్తి పురస్కారం 'ప్రకటించడం సంతోషకరం.
వేముల ప్రభాకర్ గారు రచించిన 'స్వర్ణయాగం' కవిత్వం
డాక్టర్ గురుమూర్తి పెండాకూరు గారిచే 'హొన్న హవన'గా కన్నడంలోకి అనువదించబడి 2019 లో పుస్తకంగా వెలువడింది.
వీరు రచించిన మౌనవేదన, భయంకరోనా, చంద్రలోకం కవిత్వం త్వరలోనే వెలువడనున్నాయి.
వీరు సంపాదకత్వం వహించి ప్రకటించిన నిజాం కాలంనాటి
కవి రచయిత,బహుగ్రంధకర్త 'రాఘవపట్టణం రామసింహకవి (1857-1963) ఆత్మకథ' ప్రస్తుతం ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది.
గత రెండు సంవత్సరాలుగా సామాజిక మాద్యమం ద్వారా  వెలువడుతున్న వీరి ''బహుజన వాణి '' బడుగు బలహీన వర్గాల చరిత్ర సంస్కృతికి అద్దం పడుతుంది.
జగిత్యాల జిల్లా రాయికల్ గ్రామ వాస్తవ్యులైన వేముల ప్రభాకర్ గారికి తెలుగు విశ్వ విద్యాలయం వారి 'కీర్తి పురస్కారం 'లభించిన సందర్బంగా వారి సాహితీ మిత్రులు,ప్రముఖ కవి," ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్" "కావ్యసుధ" అభినందనలు తెలియజేశారు, చిన్ననాటి స్నేహితులు ఆత్మీయత పంచుకొని హర్షం ప్రకటిస్తున్నారు.

కామెంట్‌లు