ఊహల రెక్కలు కట్టుకుని
జాబిలమ్మతో జత కడుతాం
చుక్కలన్నీ కోసుకొచ్చి
రంగవల్లులే వేస్తాం
కొంచెం భరోసా ఇస్తే
కొండలు పిండి చూపిస్తాం
భూమండమును చుట్టేస్తాం
చంద్రమండమున కాలిడుతాం
నైతిక విలువలు నేర్పిస్తే
మహనీయులమే అవుతాం
చక్కని దారి చూపిస్తే
చుక్కలు రీతి వెలుగిస్తాం
ప్రేమను కాస్త చిందిస్తే
పిల్లి కూనలై పవళిస్తాం
చెలిమి సుధలే కురిపిస్తే
మల్లె తీగై అల్లుకుంటాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి