ప్రకృతి ఒడిలో మైమరిచిన
బాల్యం ఒక అదృష్టం
భగవంతుడిచ్చిన వరం
కల్మషం లేదు కాపీర్ణం లేదు
కోపతాపాలు లేవు!!!
నిర్పూచి నిర్భయం నిర్మలం
మనస్తత్వం,
తోటి వారితో ఆటలు
తోటలలో తిరుగుళ్ళు!!!
కడుపు నింపు ప్రకృతి తల్లి యై
తగని ఆశలు లేవు తీరని
కోరికలు లేవు కోరేది
కోతి కొమ్మచ్చి ఆట అంతే!!!
ఎంత మధురం జీవనం
పచ్చని ప్రకృతి ఒడిలో
పరిశుభ్ర వాతావరణపొత్తిళ్ళ
పరిమళాలు వెదజల్లు పరిపూర్ణంగా!!!
పిల్లల ఆశల రెమ్మలు ఎదిగి ఎదిగి
పై కెదగ ఆశ, అది పసి మనసు,
పరితాపాలు లేని కమ్మని మనసు
పంచ శక్తి గలది!!!
పకపకల నిలయం, పరిహాసం కాదు
పంచ ప్రేమాభిమానాలే మెండు
ధన్య హో!! పసితనమా భగవంతుని
ప్రతిరూపమా, మరల రాని నేస్తమా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి