నిశీధిని ఏలిన నిశ్శబ్ద మౌనానికి
సెలవు ఇప్పించి నెలవు తప్పించి
కిరణ తంత్రులు మీటుతూ
ఉదయరాగమాలికల ఊయలూపి
చీకటి చీరలో ఉన్న జగతికి
బంగరు వెలుగుల వలువలు
ప్రేమ మీరగా పంచిపెడుతూ
మేదినికి మోదము పంచుతూ
ఏతెంచు ప్రభువుకై
ఎదురు చూసిన నింగి
రంగురంగుల తివాచీపరచి
ఎదురేగి స్వాగతించె!
తమ సొగసు చూచి కనులుచెదరి
దరిచేరు మలయపవనుని కై
విరితేనె పానకములు
సిధ్ధము చేసిన పూలగుత్తులు
ఎలదేటి పాటలకు
సెలయేటి నాట్యాలూ
విరిసీ విరియని పువ్వుల
ఎదలో నిలిచిన మంచు ముత్యాలు
ప్రాగ్దిశ వేదిక పైన
ప్రభాసమగు వెలుగులతో
తొణికిన కాంతికలశపు
తొలికిరణాలకు వందనములతో
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి