ఐదేళ్ల ప్రాయంలో
ఐదేళ్లు గడిపి
పదేళ్ల ప్రాయంలో
బడిని వదిలిన
గుడిలోని దేవుళ్ళు
గురువులను మరవకండి
బడిని వదిలిన
గుమ్మంలోని అమ్మానాన్నలు
గురువులను మరవకండి!!?
బడిని వదిలిన మరవకండి
బుడిబుడి నడకలు
బుడిబుడి మాటలు
బుడిబుడి బుడతలు మీ స్నేహితులను
బడిని వదిలిన మరవకండి
బడీ బాటలను
బడీ పాటలను
బడి పాఠాలను
బడి ఆటలను
ఐదు చదివి బడి వదిలిన
బడిని వదలకండి
చదువు వదలకండి
పది చదివిన
బడి వదలకండి
చదువును వదలకండి!!
బాలలు బాలికలు
చదువు అంటే సంతోషం
చదువు అంటే సంపద
చదువు అంటే శాంతి
చదువు అంటే ఒక కొత్త బంగారులోకం!!
బడిని వదిలిన చదువును వదలకండి
చదువు అంటే
గతం వర్తమానం భవిష్యత్తు!!
కాలాన్ని చదువుతో గడపండి
చదువు జీవితంతో గడుపుతుంది!!
చివరికి
మీరే ఒక బడి కావాలి
మీరే ఒక గుడి కావాలి
మీరే ఒక గుమ్మం కావాలి!!
బడిని వదిలిన చదువును వదలకండీ!!
.
ప్రాథమిక విద్యార్థుల వీడ్కోలు సందర్భంగా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి