"పంచ పాండవులు మంచం కోళ్ళల్లే ముగ్గురు";- ఎం బిందుమాధవి
  'తళ తళా..మిల మిలా పగటి పూట వెన్నెలా'...స్వప్న కూని రాగం తీస్తూ బట్టలు మడత పెడుతోంది. 
 'హుషారుగా ఉన్నావ్ ఏంటి సంగతి' అన్నాడు జగదీష్.
 'రేపు అక్షయ తృతీయ కదా! ఎంత బంగారం కొంటే అంత తూకంలో వెండి కాయిన్స్ ఇస్తారుట. ఇందాకే  పేపర్ లో చూశాను. అన్ని బంగారం షాపుల వాళ్ళు ఇంచుమించు ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నారు' అంది. 
 'వాళ్ళేం పిచ్చివాళ్ళా? ఇవన్నీ మీ ఆడవాళ్ళని బుట్టలో వెయ్యటానికి వాళ్ళు వాడే సేల్స్ ట్రిక్కులు. వెండి కాయిన్స్ ధర కూడా ఆ బంగారం వస్తువులో కలిపేస్తారు. మీరేమో వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారని ఎగబడి అక్కరలేని బంగారం కొని మా జేబులకి చిల్లులు పెడతారు' అన్నాడు. 
 'అయినా అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకుట కొనటం? ఏ వెధవ చెప్పాడు? ఏమిటి ఆ రోజు ప్రత్యేకత' అన్నాడు. 
 'భలే వారే...అక్షయ తృతీయ అంటేనే మనం కొనే బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుంది అనే అర్ధం ఆ మాటలోనే తెలియట్లేదా' అన్నది భర్తని ఒక వెర్రి వెంగళప్పలాగా చూసి. 
 'అక్షయ తృతీయ అంటే ఆ రోజు నువ్వు చేసే దానం అక్షయమైన ఫలితాన్నిస్తుందని అర్ధం. ఆ రోజే ఆది శంకరులు "కనకధార స్తవం" చేసి ఒక పేదరాలి కోసం బంగారు ఉసిరికాయలు కురిపించారుట. ఆ రోజు సింహాచలం ఆలయంలో… సంవత్సరమంతా వరాహ నరసింహ స్వామి పై ఉండే  గంధపు పూతని తీసేసి కొత్త గంధం పూస్తారుట. అలా చేసినప్పుడు..స్వామి నిజ రూప దర్శనం జరుగుతుంది.'
 'అంతే కానీ ఈ బంగారం కొనటం..లాకర్లు నింపటం ఎవరు చెప్పారో నీకు'అన్నాడు. 
 'పైగా బంగారం కొనటం అంటే డబుల్ ఖర్చు. కొనటానికి అయ్యే ఖర్చు ..మళ్ళీ అది దాచటానికి బ్యాంకులో లాకర్ తీసుకోవటం..దానికి రెంట్ కట్టటం..ఇదంతా వృధా ఖర్చు! అర్ధమవుతోందా' అన్నాడు జగదీష్. 
 'మీరెన్నైనా చెప్పండి రేపు బంగారం కొనాల్సిందే. కొనటానికి షాపుకి వెళుతున్నానని మా ఫ్రెండ్ కి కూడా చెప్పా'అన్నది మొండిగా స్వప్న. 
 'నువ్వు డిసైడ్ అయిపోయాక నేను ఆపితే మాత్రం ఆగుతావా? ఇంతకీ ఏం కొనాలి? బడ్జెట్ ఎంత'అన్నాడు నిస్పృహగా అందుకు కావలసిన డబ్బు ఎలా సమకూర్చాలా అని ఆలోచిస్తూ! 
 'రూబీ నెక్లెస్ కొనుక్కోవాలని ఎప్పటి నించో అనుకుంటున్నా!' అన్నది  కళ్ళలో మెరుపులు కురిపిస్తూ. 
 'మొన్న మా రాజు కొడుకు పెళ్ళికి పెట్టుకున్నావు కదా! నేను బావుందని మెచ్చుకున్నాను కూడా..నాకు గుర్తుంది' అన్నాడు. 
 'అది అన్ కట్ డైమండ్స్ కదండీ. దాన్ని రూబీ నెక్లెస్ అనరు' అన్నది. 
 'అందులో పెద్ద పెద్ద రూబీస్ ఉన్నాయిగా' అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. 
 'అవును..ఉన్నాయి కానీ దాన్ని అన్ కట్ డైమండ్ నెక్ లెస్ అంటారు' అన్నది భర్తని వెర్రి వాడిలాగా చూసి. 
 'మా మేన కోడలి గృహ ప్రవేశానికి పెట్టుకున్న నెక్లెస్ మాటేమిటి' అన్నాడు పట్టు వదలని విక్రమార్కుడి లాగా. 
 'అది రూబీ-ఎమెరాల్డ్ నెక్లెస్ అండి. అందులో రూబీలు చిన్నవి. ఎమెరాల్డ్ డామినేటింగ్ గా ఉండి ఎర్ర రాళ్ళు అస్సలు కనిపించవు. అందుకే ఈ సారి ఏమైనా కానీ పూర్తి పెద్ద రూబీలతో నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నాను' అన్నది పట్టుదలగా. 
 ఇంతలో జగదీష్ దృష్టి గోడకి వేలాడుతున్న తమిద్దరి కలర్ ఫొటో మీద పడింది. అందులో స్వప్న నిమ్మ పండు రంగుకి మెరూన్ అంచు ఉన్న చీర కట్టుకుంది. దానికి మ్యాచింగ్ గా ఎర్ర రాళ్ళ నెక్లెస్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. 
 తల తిప్పి 'దీని మాటేమిటోయ్' అన్నాడు..భృకుటి ముడిచి. 
 'అది రూబీస్ కాదనుకుంటానండి. ఆర్టిఫిషియల్ స్టోన్సేమో. నెల్లూరులో దొరుకుతాయని మా వదిన తెస్తే వాటితో మా ఊళ్ళో కంసాలితో మా అమ్మ చేయించింది' అన్నది. 
 ఇంతలో ఫోన్ మోగింది. అటు నించి కూతురు! భార్యతో ఇందాకటి నించి జరుగుతున్న సంభాషణ కూతురికి చెబుదామని ఫోన్ తీశాడు జగదీష్. 
 "నాన్నా అమ్మకివ్వండి ఫోన్..ఒక మాట అడగాలి" అన్నది. 
 ఫోన్ చేతిలోకి తీసుకుని "ఏంటమ్మా" అన్నది. 
 కూతురు పెద్ద పెద్ద రూబీస్ తో చేసిన ఒక చెయిన్ లాంటిది చూపించి "అమ్మా...ఇది నువ్వెక్కడ చేయించావో అడగమన్నారు మా అత్తగారు. ఆవిడకి చాలా నచ్చిందిట. ఆవిడెక్కడ తనకిచ్చెయ్యమంటారో అని….అది నీదని..నీకు ఇచ్చెయ్యాలి అని చెప్పాను. ఈ సారి వచ్చినప్పుడు నీకు ఇచ్చేస్తాను. నా దగ్గర కనిపిస్తే మళ్ళీ అడగచ్చు" అన్నది. 
 జగదీష్ తల పక్కకి తిప్పి..."ఓహో ఇదొకటి కూడా ఉందన్నమాట! అయినా అక్షయ తృతీయ పేరు చెప్పి మళ్ళీ రూబీ నెక్లెస్ అనే కార్యక్రమం తలపెట్టావన్నమాట" అన్నాడు. 
 'అది నిరుడు ధన్ తే రస్ కి మీరే  కొన్నారు..గుర్తు లేదా?' అన్నది 
 'సరే ఎప్పుడు కొంటే ఏం? కొన్నాం కదా! ఇలా సంవత్సరానికి రెండు సార్లు 'ధన్ తే రస్' పేరు చెప్పి, 'అక్షయ తృతీయ' పేరు చెప్పి షాపుల వాళ్ళు మనని లూటీ చేస్తున్నారు. ఆడ వాళ్ళ బలహీనతని వాడుకుంటూ వాళ్ళ సేల్స్ పెంచుకుంటున్నారు.
 "పంచపాండవులు మంచం కోళ్ళల్లే ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించిందిట" నీ బోటి ఆవిడ! 
 "నాలుగు రూబీ నెక్లెస్ లు ఉంటే ఒకటి అన్ కట్ డైమండ్ అంటావ్..ఇంకొకటి ఎమెరాల్డ్ అంటావ్..మరొకటి అసలు రూబీయే కాదంటావ్..ఒకటి 'అది నెక్లెస్ కాదు చెయిన్ అంటావ్! అన్నిటికీ అన్నీ ఏవో కారణాలు చెబుతున్నావ్". అసలు నీకు కావలసింది నెక్లెస్సా? రూబీసా? లేక నా చేత డబ్బు ఖర్చు పెట్టించి అవసరం లేని బంగారం కొనిపించటమా' అన్నాడు. 
 'సరే... బంగారం కొనాలనుకున్నాక వెనక్కి తగ్గటం మంచిది కాదండి. అరిష్టం! పోనీ అలా వెళ్ళి ఒక తులంలో  బంగారం కాయిన్ కొనుక్కొద్దాం. ఆఫర్ కింద ఇంకొక తులం వెండి కాయిన్ ఇస్తాడు. ఇలా నాలుగైదు పోగయితే ఏదో ఒక వెండి డబ్బానో..చిన్న పళ్ళెమో వస్తుంది అన్నది స్వప్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా! 
['పంచ' అనటంలోనే ఐదు సంఖ్య తెలుస్తుండగా నాలుగు కోళ్ళు ఉండే మంచంతో వారిని పోల్చి..ముగ్గురు అని నోటితో చెబుతూ..రెండు వేళ్ళు చూపించటం అంటే తాము అనుకున్న దాన్ని సాధించటానికి అసంబద్ధమైన వాదన చేస్తే ఈ సామెత వాడతారు.]

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం
భళిరే నైరా
చిత్రం