* కోరాడ గీతాలు *

 పల్లవి :-
       అయ్యో... నా  సెల్లు పాడై పోయెనే... 
అయ్యయ్యో... నా మెదడు మొద్దుబారి పోయెనే..!
           " అయ్యో... నా సెల్లు.. "
చరణం :-
    ఇంట్లో  అందరియేడుపు తగిలింది..., సెల్ల్  స్క్రీను బ్లాకై పోయింది.... 2
    సెల్లో  గ్రూపు లేవీ కానరాక నా మనసు  బావురుమంటోంది  
       "అయ్యో   నా  సెల్లు... "
చరణం :-
     నే నేమి రాయాలో తెలియక నామది  విల -  విలలాడిపోయే ను, 
     సోమ వారం నానీలు... 
   మంగళవారం వచనకవితలు, 
  బుధ వారం  చిత్రకవితలు...
  గురువారం మినీ కవితలు... 
  బాలగేయాల  శుక్రవారం... 
  లలిత గీతాల  శని వారము...,
   ఈ రోజులన్నీ బిత్తరపోయి... 
   దీనంగా నను చూచుచుండెనే 
       " అయ్యో... నా సెల్లు... "
    ********
  ఓ వారం రోజులపాటు  నా పాత  సెల్లు పనిచేయని కారణంగా.... నేను రాసుకున్న గీతం... !.... కోరాడ.
కామెంట్‌లు