చిత్రానికి పద్యం ; - సాహితీసింధు సరళగున్నాల
అందము తాండవమాడగ
సుందరి యో బిందె చేత సొబగులుగురియన్
ముందరకున్ వంగి జలము
నందగ మురిసె తన వానికందించుటకై

ముగ్ధ మోహన రూపమ్ము మురిపెమంద
జేయ , కొలనులో నీటికై చేయిచాచి
 హొయలునుప్పొంగ జలములన్ యుక్తినెరపి
ముంచ వలెనా నిక వలద యంచు నుండె

కామెంట్‌లు