చిన్నారులు;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
విరబూసిన పూవులు
హరివిల్లుల సొగసులు
చిన్నారుల నగవులు
వెన్నెలమ్మ జల్లులు

వెన్నపూస మనసులు
కన్నవారి శ్వాసలు
చిన్నారులు భువిలో
మిన్న కదా మదిలో

ముద్దులొలుకు తారలు
ముద్దబంతి సుమములు
అద్దంలా పిల్లలు
పెద్దలకూ మిత్రులు

తేనె వంటి పలుకులు
వాన జాణ కులుకులు
పసి పిల్లలు ఇంటికి
కాంతులీను ప్రమిదలు


కామెంట్‌లు