వారాల ఆనంద్ కవిత్వం ‘చిన్నోడి  ముక్తకాలు ‘ పుస్తకం ఆవిష్కరణ

 సుప్రసిద్ధ కవి, ఈ ఏటి కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘చిన్నోడి ముక్తకాలు’ పుస్తకాలు పుస్తకావిష్కరణ ఇటీవల హైదరాబాద్ ల్ జరిఇంది. హైదరాబాద్ నార్సింగి లోని తెలంగాణా క్రీడా ప్రాంగణం ల్ జరిగిన ఈ సాహిత్య కార్యక్రమంలో ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీఎనివాసాచార్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొప్ప భావుకుడయిన కవి వారాలా ఆనంద్ తన మనవడిలో తన బాల్యాన్ని దర్శించుకుని రాసిన కవిత్వమిది అన్నారు. తనని తాను అద్దంలో చూసుకుని ఆయన ఈ రచన చేసారని అన్నారు. ఎవరికయినా జీవితంలో బాల్యం అత్యంత మధురమయినదన్నారు. ఇవ్వాళ అరవై ఏళ్ళు దాటిన ప్రతివాళ్ళూ ఈ ‘చిన్నోడి ముక్తకాల ల్లో తమని తాము దర్శుంచు కుంటారని అన్నారు.గొప్ప స్పందనతో ప్రతీకాత్మకంగా ఈ రచన సాగింది అన్నారు. మంచి కవి అనువాదకుడు సినిమా విమర్శకుడు అయిన వారాల ఆనంద్ విశ్వజనీనమయిన తాతా మనవళ్ళ అనుబంధాన్ని కవితాత్మకంగా రాసారు అన్నారు. సభకు అధ్యక్తత వహించిన ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ మనిషి జీవితంల్ బాల్యాన్ని మించిన ఆనందం మరేదీ లేదన్నారు.అలాంటి బాల్యాన్ని ఊరించి అరవై ఏళ్ల వయసు దాటాక మళ్ళీ దర్శించి రాయడం గొప్పగా వుంది అన్నారు. కవితాత్మకంగా రాయాడం చాలా బాగుంది అన్నారు. సాహితీ విమర్శకురాలు డాక్టర్ విశ్నువందనా దేవి మాట్లాడుతూ తాతా మనవళ్ళు అయిన వారాల ఆనంద్ ప్రద్యుమ్న ల అనుబంధం కవితా రూపంలో ఆవిష్కృత మయింది అన్నారు. మనవడితో తాత పెంచుకున్న ప్రేమ అందరికీ చెందుతుంది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిన్నోడు ప్రద్యుమ్న, రేల, వేణుమాధవ్, ఇందిర రాణి తదితరులు హాజరయ్యారు.   
*****
కామెంట్‌లు