శిశిరం................
ఆకురాలు కాలాన
అనుభవాలే పాఠాలు.
శిశిరం................
పిందెరాలు కాలాన
జ్ఞాపకాలే సంతోషాలు.
శిశిరం.................
పూలురాలు కాలాన
పరిణతులే పురోగమనం.
శిశిరం..................
మనుగడకు చేస్తున్న మార్పులే
సంకేతాలు.
శిశిరం.....................
కదలిపోతున్న కాలాన
గమ్యాల వైపు గమనం.
శిశిరం.....................
ప్రకృతి తనకు తాను పోసుకుంటున్న స్నానం.
శిశిరం......................
చైత్రంలోకి అడుగుపెడుతూ
వసంతానికి స్వాగతం.
జీవనం నిత్యనూత్నమవుతూ
సాగిపోతూనే ఉంటుంది.
ఆగదు.....
నిలవదు......
చతికిలపడదు..........
పయనం కొనసాగుతూనే ఉంటుంది.
పరిమళాలు వదిలిపెడుతూ
కర్తవ్యం వైపే అడుగులు.
కాసేపు సేద తీరినా........
అలుపెరుగని పయనానికి పలకరింపులు.
నడకే చైతన్యానికి గుర్తు.
నడుస్తూ ఉంటేనే జీవనానికి అర్థం.
కలిసి వెళ్ళినా............
ఒంటరిగా వెళ్ళినా.............
నలుగురు మోసేవరకు తప్పదు.
కన్నీరుమున్నీరైనా......
కాటి కాడ కాలక తప్పదు.
బంధవిముక్తమవ్వక
ఆత్మ పరమాత్మను చేరదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి