శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఖత్రీ ఖత్రియ సంస్కృతంలోని క్ష  ప్రాకృతపాళీ అపభ్రంశమై  ఖ.  అవుతుంది. పాలీ భాష లో క్షత్రియ బదులు ఖత్రియ అని వాడ్తారు.వీరు పంచనద ప్రాంతవాసులు.దేశరక్షణ కై వీరోచితంగా యుద్ధం చేశారు. తాము సూర్యవంశ చంద్రవంశజులమని చెప్తారు. సైనికజాతి.కానీ క్రమంగా వ్యాపారులు గా మారారు. అరౌరా కక్కడ్ చోపడా భాటియా లోహియా శివపురీ అనే శాఖలున్నాయి.
ఖాన్ అనేది టర్కీరాజుల సర్దారుల బిరుదు.ఖానమ్ స్త్రీలింగం! కాగాన్ ఖాకాన్ అనే అరబిక్ పదాలనించి వచ్చింది. మధ్య ఆసియాలో  ఇలేక్ ఖాన్ అనే తుర్కీ వంశం ఉండేది. ఈవంశంని ఖాన్ అని పిల్చారు10వ శతాబ్దంలో!ఆపై రాజ్యంలోని ఉన్నత అధికారులను  గౌరవం గా ఖాన్ అనేవారు. మధ్య ఆసియాలో  మొగల్ పాలకులను ఖాన్ అనసాగారు.ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ లో మంచి వ్యక్తిని  ఖాన్ అని సంభోదించేవారు. బ్రిటిష్ కాలంలో వారిహితైషులకూ ముస్లిం పార్శీలకు ఖాన్ సాహెబ్  ఖాన్ బహదూర్  అనేబిరుదులిచ్చేవారు.
ఖానాబ్ దోశ్ అంటే భుజాల పై ఇంటిని మోసేవాడు అని అర్ధం. సంచారజీవులు.ఎక్కడ పడితే అక్కడ డేరా గుడారం వేసుకుని ఉంటారు. ఆపై ఇంటి సామాన్లు భుజాల పై మోసుకుంటూ అలా వేర్వేరు ప్రాంతాలకు తరలిపోతారు.ఇది ఫారశీ శబ్దం 🌷

కామెంట్‌లు