పెద్దల మాట చద్ది మూట;- కొప్పరపు తాయారు

 జానకి ,సీత చిన్నప్పటినుండి స్నేహితులు  చదువుకొనేవారు, ఆడుకునేవారు,  ఆ రోజు కూడా  ఆడుకో డానికి వెళ్లారు.అప్పుడు సీతా వాళ్ళ అమ్మగారు ఎప్పుడు ఆటలేనా చదువు సంధ్యలులేకుండా ఏమిటా ఆటలు అన్నారు‌. వెంటనే జానకిరా సీతా అమ్మకి కోపం తెప్పించకుండా,మనం చదువు కుందాము అంది.సీతకి జానకి మాటలురుచించలేదు ఆమెకి ఆటల పిచ్చి.నువ్వు పోయి చదువుకో నేను రాను అంది.జానకి మారు మాటాడకఇంటికివెళ్ళిపోయింది.
ఈ సీత ఆడుతూ ఆడుతూ జారి పడి పెద్ధదెబ్బతగిలి కళ్ళు తిరిగి పడిపోతే ఎవరోఎత్తుకుని
వాళ్ళ ఇంటి వివరాలు తెలుసు కుని ఆ పిల్లని ఇల్లుచేర్చారు. కానీ సీత తల్లి, జానకే కారణం అని తిట్టుకుంది. డాక్టర్ కి చూపెట్టి మందులు ఇప్పించిన తర్వాత ... చూడ్డానికి జానకి వాళ్ళ అమ్మగారువచ్చారు. వస్తే" జానకి నువ్వు రాకు నీవల్లే మా అమ్మాయి పడిపోయింది" అని అంది వెంటనే సీత లేదమ్మా నువ్వు పిలవగానే రా ఇంటికి పోదాం, మనం పెద్ద వాళ్ళ మాటలు  వినాలి అంది. నీకేం, నువ్వు పో అన్నాను. ఆడుకుంటూ ఉంటే జారీ పడిపోయాను. అప్పుడు నాకు దెబ్బ తగిలింది
అమ్మ. అంది.
         జానకి మంచితనం, పెద్దల మీద గౌరవం తెలుసుకుని, సీత వాళ్ళ అమ్మగారు పొరపాటయింది తల్లి, నన్ను క్షమించు అనబోతే జానకీ వాళ్ళ      అమ్మగారు చిన్నపిల్ల ఆ పిల్లని క్షమాపణ అడగడం  ఏంటి తప్పు మీరు పెద్దవారు అంది.
           అంచేత మనం పెద్దవారి మాటలకు గౌరవం ఇచ్చి తీరాలి ఎందుకంటే వాళ్లు అనుభవం మీద మనకి చెబుతారు కాబట్టి. అందుకే పెద్ద వారి మాట చద్ది మూట అన్నారు.
కామెంట్‌లు