బందీ!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు ఎక్కడ నించో ఎగిరి వచ్చిన  అందమైన పిట్టను పార్కులో పిల్లలంతా చూశారు.చకచకా శైత్యోపచారాలు చేశారు. ఆకాలనీ ప్రెసిడెంటు ఆపిట్టను జాగ్రత్తగా కొన్నాళ్ళు కాపాడమని పిల్లలకి చెప్పాడు. ఇంకేముంది?ఎవరికి వారే దానికి గింజలు పండ్లముక్కలు మంచి నీరు పెట్టి పంజరంలో ఉంచారు. ఓనెలకల్లా అది బాగా కోలుకుంది.ఇక పంజరంలోంచి బైటపడాలని తెగ తాపత్రయపడసాగింది.ఆకాలనీ పెద్ద మనిషి ఓతాతగారు చూసి "పిల్లలూ! మీరు ఇక దాన్ని స్వేచ్ఛగా వదిలేయండి. పాపం ఎగిరి పోవాలని ఆశపడుతోంది" అని అంటే"తాతా!కష్టపడి కాపాడి పెంచుతున్నాం.నీకేం బాధ?" అని ఎదురు జవాబు ఇచ్చారు. 
ఆరోజు వీధి కుక్కలు తెగ అరుస్తూ పిల్లల వెంటపడ్డాయి. తాత వాటిని తరిమేసి వెంటనే మున్సిపాలిటీ వారికి సమాచారం ఇచ్చారు "త్వరగా వీధి కుక్కలను పట్టుకోండి.పిల్లలు పెద్దలకి అపాయం"అని.ఆరోజు ఆదివారం కావటంతో పార్క్ కి బయల్దేరుతున్న పిల్లలని తాత ఓగదిలో పెట్టి బైట గడియేశాడు.మున్సిపాలిటీ వారు వచ్చారు. ఓఆరు గంట లు ఆగదిలో బందీలుగా ఉన్న పిల్లలు గోలగోలగా అరవసాగారు"తాతా!తాళం తీయి.ఎంత సేపుమేము ఈగదిలో ఉండాలి?" "ఏం! మీకు చాక్లెట్లు బిస్కెట్లు పళ్ళు అన్నీ ఇస్తున్నాకదా? పాపం ఆపిట్టను మీరు పంజరంలో బంధించలేదా?అది మీలాగా అరవలేదుకదూ?"అంతే తాత మాటలకి"బుద్ధి వచ్చింది తాతా!ఆపిట్టను విడిచి పెట్టు"అని ముక్తకంఠంతో అరిచారు. 🌷
కామెంట్‌లు