చేపలు
అవి ఎక్కడున్నావో
మర్చిపోయి హాయిగా ఉన్నాయి!!
బావిలో చేప
చెరువులో కొచ్చి
చెరువులో చేప
సముద్రంలో కొచ్చి
అవి ఎక్కడున్నాయో
గుర్తుచేస్తాయి!!
బావి చెరువు సముద్రం
అల్లకల్లోలం అవుతుంది!
సముద్ర చేప చెరువులో చేపను
చెరువులోని చేప బావిలోని చేపను
తింటుంది!!?
భాగ్యవంతుడు
తను ఎక్కడున్నాడో మర్చిపోయిన
పర్వాలేదు! కానీ
దరిద్రుడు దరిదాటకూడదు
తను ఎక్కడున్నాడో
మర్చిపోతేనే మంచిది!!?
మనం ఎక్కడున్నామో
మర్చిపోతేనే మంచిది!!?
గుర్తు చేసే వారికి
దూరంగా ఉండండి దూరంగా జరగండి!!
మిమ్మల్ని గుర్తించకున్నా
మీకు గుర్తున్న
మీరెక్కడున్నారో
మర్చిపోయి జీవిస్తేనే మంచిది!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి