ప్రకృతి ని అనుసరించి మన పండుగలు ఆచారాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.రోగాలబారినుంచి కాపాడే ఉద్దేశంతో ఆనాడు ఆచరించాల్సిన విధులు మన పెద్దలు విధించారు.హోళీ పండుగరోజు మోదుగ పూలు నీటిలో వేసి బాగా కాచి తలస్నానం చేయాలి.కాషాయరంగులో ఉండే ఆనీటితో స్నానం చేస్తే చర్మవ్యాధులు రావు.ఆఉద్దేశంతో రంగులు చల్లుకుంటూ ఆడిపాడమన్నారు.ప్రకృతిలో లభించే మూలికలతో పూలకషాయాలు అందరిపై చల్లితే వైరస్ దరిచేరదు.శానిటైజర్ లా వాడేవారు.బంతి చేమంతి వేపాకులు మారేడు దళాలు (నిర్మాల్యాలు) చెత్త,లో పారేయకుండా నీటిలో వేసి మరిగించి స్నానం చేస్తే ఆరోగ్యం చర్మవ్యాధులు రావు.ఇప్పుడు రసాయనాలకల్తీ పొడులు వాడి కంటిచూపు పోగొట్టుకున్న కేసులు కూడా ఉన్నాయి.లేని పోని చర్మరోగాలు వస్తున్నాయి.కాబట్టి గుప్పెడు మోదుగ పూలు వేసి కాచి ఆనీటితోటే స్నానం చేయాలి.
ప్రకృతి పండుగలు! అచ్యుతుని రాజ్యశ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి