సాత్విక ఆహారం; - : సి.హెచ్.ప్రతాప్
 మనిషి శరీరం ఆహారం చేత నిర్మించబడుతుంది. సాత్విక  ఆహారం గ్రహిస్తేనే దేహం ఎదుగుదల చక్కగా వుంటుంది. దేహాంతర్గతంగా ‘ఆత్మ’వసిస్తుంది. ఆత్మశుద్ధిగా ఉండి, పరమాత్మ ఉపాసన చేయాలంటే శుద్ధ సాత్విక ఆహారాన్ని శరీరం స్వీకరించాలి. పూర్వయుగాల్లో వేదఋషులు అడవుల్లో కందమూలాలు, ఫలాలు తింటూ తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం తో పాటు ముఖ్తిని కూడా సాధించగలిగారు.
సాత్త్వికాహారం గ్రహించని శరీరం, మనస్సు చంచలత్వాన్ని పొందుతాయి. చంచలత్వాన్ని పొందిన మనస్సు పరమాత్మోపాసన చేయలేదు అని యోగం చెబుతొంది.
‘‘పుష్టం సుమధురం స్నిగ్ధం గవ్యం ధాతు ప్రపోషణమ్
మనోభిలషితం యోగ్యం యోగీ భోజన మాచరేత్’’
ఈ శ్లోకానికి అర్ధం :
 
దేహానికి పుష్టినిచ్చేవి, మధురమైనవి, మృదువుగా ఉండేవి, ఆవుపాలు మొదలగునవి వాటితో కూడి ఉండేవి, మనస్సుకు ప్రియమైనవి, ధాతువును పోషించే యోగ్యమైన ఆహారాన్ని మాత్రమే మానవులు భజించాలి.
జీర్ణం తొందరగా జరిగే పళ్లు, కూరగాయలు, అపక్వాహారం శరీరానికి మంచిని కలుగజేస్తాయియ్, అన్ని అనారోగ్యాలను దూరం చ్గేస్తాయి.
ఆహారం

విషయానికి వచ్చేసరికి అది మీ శరీరం. ఎటువంటి ఆహారంతో అది సౌఖ్యంగా ఉంటుందో మీ నాలుకని కాకుండా, మీ శరీరాన్ని అడగండి అని సద్గురు జగ్గీ ఒకసారి చెప్పారు. రుచికి సంబంధం లేకుండా ఆర్ఫ్గ్యం కలగజేసే ఆహారం మాత్రమే స్వీకరించాలని యోగసాస్త్రం చెబుతొంది. 
కామెంట్‌లు