శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 సంస్కృతపదం వండుర్ నించి కుందరు వచ్చింది.ఇదొకరకంతీగ.చిన్న చిన్న కాయలు బింబాఫలాలు కాస్తాయి.దొండకాయలాంటి ఈకాయను తింటే బుద్ధి మాంద్యం కల్గుతుంది అని భావిస్తారు చాలా మంది.ఇందులో విటమిన్ సి ఎక్కువ.
కిరాతులు హిమాలయ తూర్పు ప్రాంతంలో ఉండే జాతివారు.కుమావ్ ప్రాంత వన్యజాతి వారు.శివుని ఓఅవతారం కిరాతుడు.యోగవాసిష్ఠంలో ఇలా ఉంది"అత్యంత కృపణ్ కశ్చిత్ కిరాటోధన ధాన్యవాన్. అంటే వ్యాపారులని అర్థం.నెయ్యి నూనె క్రయవిక్రయాలు చేసేవారు కిరాట్ లు.పంజాబ్ లోబనియా అంటారు.కిరాట్ నించి కిరాత్ వచ్చింది.కిరాతార్జునీయం లో శివుడు కిరాతుని వేషంలో వచ్చాడు.చిత్రాంగద కిరాతవంశ రాకుమారి.పసుపువన్నెలో చైనా జాతి పోలికలతో ఉండే వారు టిబెట్ నేపాల్ బర్మా అస్సాం బెంగాల్ బీహార్ లో స్థిరపడ్డారు.యజుర్వేద అధర్వవేదంలో వీరిగూర్చి ఉంది.
కన్యా కుబ్జం ఒక నగరం జాతికి చెందిన పదం.కనౌజ్ పూర్వనామం ఇది.యు.పి.బ్రాహ్మణులలో ఒక శాఖ.రాముని మనవడుకుశనాభుడు దీని నిర్మాణం చేశాడు.ఘృతాచీ  కుశనాభులకు 100మంది కూతుళ్ళు పుట్టారు.అన్నిటా అందెవేసిన చేయి వారిది.పవనదేవుడు"మిమ్మల్ని పెళ్ళాడుతాను"అని అంటే గర్వంగా హేళన చేశారు.మరుగుజ్జులుగా మారమని అతను శపించాడు.అలా వారంతా కుబ్జలుగా మారారు.రాజతరంగిణిలో ఈశాపవివరణ ఉంది.దీనికే గాధిపుర్ గాధినగర్ కుశస్థల్ మహోదయ అనే పేర్లు న్నాయి.

కామెంట్‌లు