ఆనది ఒడ్డున ఓముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ కొంత మంది పిల్లలు ఆడుతూఉన్నారు.ముని వారిని గూర్చి పట్టించుకోకుండా తన ధ్యానంలో మునిగాడు.ఆయన శిష్యుడు కూడా ధ్యానం లో కూచున్నాడు. గురువు తోపాటు అతను సాధనచేస్తున్నాడు.ఇంతలో దూరంగా పిల్లల అరుపులు వినపడ్డాయి"అయ్యో!శివా మునిగి పోతున్నాడు.కాపాడండి "అని ఓపిల్లాడు ఆశిష్యుని దగ్గరికి వచ్చాడు. శిష్యుడు ధర్మసందేహంలో పడ్డాడు. "నేను ధ్యానం లోంచి లేస్తే గురువు గారికి కోపం వస్తుందేమో!ఓపిల్లాడు నీటిలో మునిగి పోతుంటే చూస్తూ కూచోటం భావ్యమా? అతని తల్లి దండ్రుల బాధ కడుపుకోత ముందు నా ధ్యానం ఎక్కువ కాదు. ముని కోపించినా సరే" అని గబగబా లేచి పరుగునవెళ్లి ఆపిల్లాడిని కాపాడాడు.ఆతర్వాత మునికి ఈవిషయం చెప్పాడు."నేను గుర్వాజ్ఞను ధిక్కరించాను.నాకు సెలవు ఇప్పించండి". ముని అతనితో అన్నాడు "నాయనా!నిజమైన భక్తుడివి నీవే! ఓప్రాణిని కాపాడావు.నీవే నాకన్నా మిన్న!"మానవత్వం కలవాడే నిజమైన సాధు సన్యాసి సుమా🌹
కర్తవ్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి